సకల శుభాల నొసగే దివ్య క్షేత్రం
నరసింహస్వామి పేరు వినడానికి కూడా దుష్టశక్తులు సాహసించవు. ఆయన వున్న ప్రదేశానికి కనుచూపు మేరలో సంచరించడానికి అవి భయపడతాయి. ఆయన భక్తులను ఇబ్బందులు పెట్టాలనే ఆలోచన కూడా అవి చేయవు. అందుకే దుష్ట ప్రయోగాల బారి నుంచి బయటపడాలనుకునే వాళ్లు స్వామిని ఎక్కువగా ఆశ్రయిస్తూ వుంటారు.
ఇక స్వామివారికి సకల ఉపచారాలు చేస్తూ ... శాంతింపజేస్తూ అమ్మవారు కూడా ఆయనతో పాటు దర్శనమిస్తూ వుంటుంది. ఆ తల్లి అనుగ్రహం కారణంగానే సంతాన సౌభాగ్యాలు నిలుస్తాయని మహిళా భక్తులు విశ్వసిస్తూ వుంటారు. ఇలా భక్తులచే నిత్యనీరాజనాలు అందుకుంటోన్న లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం మహబూబ్ నగర్ లో కనిపిస్తుంది.
ఇక్కడి ఆలయంలో ప్రతిష్టత విగ్రహంగా లక్ష్మీనరసింహస్వామి దర్శనమిస్తూ వుంటుంది. ఆ పక్కనే గల కొండరాయిపై వెలసిన రూపంగా వరాహస్వామి కనిపిస్తూ వుంటాడు. ఈ విధంగా వుండటం అరుదైన విషయం కనుక, ఈ క్షేత్రం మరింత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. ఎత్తైన రాజగోపురం ... దేవతా మూర్తులను మలచిన ప్రాకారాలు ... సువిశాలమైన మంటపం ఆలయ వైభవానికి అద్దం పడుతుంటాయి.
గర్భాలయంలో స్వామివారు లక్ష్మీసమేతుడై ఆదిశేషుని పడగ నీడలో ఆశీనుడై వుంటాడు. హనుమంతుడు క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తోన్న ఈ క్షేత్రంలో, మాఘపౌర్ణమి సందర్భంగా ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. ఈ సమయంలో స్వామివారిని దర్శించుకునే భక్తిల సంఖ్య ఎక్కువగా వుంటుంది. ఇక్కడి స్వామివారిని దర్శించడం వలన ఆపదలు ... అనారోగ్యాలు తొలగిపోయి, సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ఆ స్వామితో గల అనుబంధం కారణంగా తమకి కలిగిన అనుభవాలను మహిమలుగా చెబుతుంటారు.