భక్తుడి గాయం భగవంతుడిని బాధిస్తుందా ?
శ్రీరంగనాథుడిని సేవించి తరించిన మహా భక్తులలో 'తిరుప్పాణ్ ఆళ్వార్' ఒకరు. అయోనిజుడుగా అవతరించిన ఆయన, తక్కువ కులానికి చెందినవారి కుటుంబంలో పెరిగి పెద్దవాడవుతాడు. ఊహ తెలిసిన నాటి నుంచి ఆయనకి శ్రీరంగనాథుడిని సేవించడం ... కీర్తించడం మినహా మరో ధ్యాస ఉండేది కాదు. తనకి ఆలయ ప్రవేశం లేదని తెలిసిన ఆయన, అనునిత్యం 'వీణ'ను ధరించి కావేరీ నదీ తీరానికి చేరుకునేవాడు. స్వామివారి ఆలయశిఖరం కనిపించేలా కూర్చుని ఆయనని కీర్తిస్తూ ఉండేవాడు.
అలా ఒకరోజున ఆయన తనని తాను మరిచిపోయి స్వామివారిని కీర్తిస్తూ వుండగా, అక్కడికి 'లోక సారంగముని' వస్తాడు. ప్రతినిత్యం ఆయన కావేరీ నదీ జలాలతో శ్రీరంగనాథుడిని అభిషేకిస్తూ ఉంటాడు. తన దారికి అడ్డుగా వున్న తిరుప్పాణ్ ఆళ్వారులను తప్పుకోమని అంటాడు సారంగముని. స్వామివారిని కీర్తిస్తోన్న ఆయనకి ఆ మాటలు వినిపించవు. అసహనానికి లోనైన లోక సారంగముని, తన రాకను ఆయనకి తెలియజేయడం కోసం ఒక చిన్న రాయిని తీసుకుని విసురుతాడు.
అది తిరుప్పాణ్ ఆళ్వారుల నుదుటికి గాయం చేయడంతో రక్తం కారుతూ వుంటుంది. ఈ లోకంలోకి వచ్చిన తిరుప్పాణ్ ఆళ్వారులు, విషయాన్ని గ్రహించి పక్కకి తప్పుకుంటాడు. గాయాన్ని పట్టించుకోకుండా మరోచోట కూర్చుని స్వామిని గురించి పాడుతుంటాడు. అభిషేక జలంతో ఆలయానికి చేరుకున్న లోక సారంగముని, స్వామివారి మూలమూర్తి నుదుటి నుంచి రక్తం స్రవిస్తూ వుండటం చూసి నివ్వెరపోతాడు. తాను చేసిన అపరాథమేమిటో సెలవీయమని స్వామివారి పాదాలపై పడతాడు.
తిరుప్పాణ్ ఆళ్వారుల పట్ల అతని ప్రవర్తన గురించి స్వామి ప్రస్తావిస్తాడు. ఆ మహాభక్తుడి గాయాన్నీ ... బాధను తాను స్వీకరించినట్టు చెబుతాడు. తన సన్నిధికి రాలేక బాధపడుతోన్న ఆయన్ని తక్షణమే తీసుకురమ్మని ఆదేశిస్తాడు. కులం పేరుతో గల నిబంధనలను దృష్టిలో పెట్టుకుని ఆయన రానంటే, భుజాలపై ఎక్కించుకుని గౌరవప్రదంగా తీసుకురమ్మని చెబుతాడు. స్వామి ఆదేశం మేరకు లోక సారంగముని అలాగే చేస్తాడు. అలా ఆయన భుజాలపై స్వామివారి సన్నిధికి చేరుకున్న తిరుప్పాణ్ ఆల్వార్, శ్రీరంగనాథుడిని కనులారా దర్శిస్తూ పులకించిపోతాడు. స్వామివారిని కీర్తిస్తూ మురిసిపోతాడు ... మైమరచిపోతాడు.