అందుకే ఇది దివ్యక్షేత్రంగా ప్రసిద్ధిచెందింది !
పవిత్ర నదీ జలాల గురించిన ప్రస్తావన వస్తే, ఎవరైనా సరే ముందుగా గంగానది గురించే చెప్పుకుంటారు. పుణ్య స్థలాలను గంగాదేవి స్పర్శిస్తూ ప్రవహిస్తూ పరవశిస్తూ వుంటుంది. ఆయా ప్రదేశాలకు మరింత పవిత్రతను ... విశిష్టతను తీసుకొస్తూ ముందుకు సాగుతుంటుంది. దారి పొడవునా వివిధ క్షేత్రాల పాదాలను అభిషేకిస్తూ, భక్తుల పాపాలను కడిగేస్తూ పరుగులుతీస్తూ వుంటుంది. అందుకే గంగ నీటిని భక్తులు ప్రత్యేక పాత్రల్లో ఇంటికి తీసుకువెళుతూ వుంటారు. ఆ నీటిని తీర్థంగా స్వీకరించినా ... తలపై చల్లుకున్నా సమస్త పాపాలు నశిస్తాయని విశ్వసిస్తూ వుంటారు.
అంతటి విశిష్టతను 'కావేరీ నది' కూడా సొంతం చేసుకున్న క్షేత్రం ఒకటుంది ... అదే ... 'తిరు ఇందళూరు'. చంద్రుడు ... స్వామివారిని ప్రసన్నం చేసుకుని, శాపవిమోచనం పొందిన ప్రదేశం కనుక ఈ క్షేత్రానికి ఈ పేరు వచ్చిందని అంటారు. ఇది స్వామివారు కావేరీ నదిని పాన్పుగా స్వీకరించిన ప్రదేశంగా చెప్పబడుతోంది. తమిళనాడు - మాయవరంలో భాగంగా ఈ క్షేత్రం దర్శనమిస్తూ వుంటుంది.
స్వామివారు సుగంధ వననాథుడు పేరుతోను ... పరిమళ రంగనాథుడు పేరుతోను భక్తుల పూజలు అందుకుంటూ వుంటాడు. గర్భాలయంలో స్వామివారు వీరశయనుడిగా భక్తులకు దర్శనమిస్తూ వుంటాడు. ఇక అమ్మవార్లు చంద్రశాపవిమోచనిగా ... పుండరీకవల్లిగా భక్తులను అనుగ్రహిస్తుంటారు. నూటా ఎనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఒకటిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రం, విష్ణు భక్తులకు లభించిన అపూర్వమైన వరంగా చెప్పుకోవచ్చు.
ఎంతోమంది దేవతలు ... మహర్షులు ఈ స్వామిని సేవించారు. మరెంతో మంది మహాభక్తులు స్వామివారిని కీర్తించారు. మహారాజులు స్వామిని తమ ఇలవేల్పుగా భావించి పూజించారు. ఈ క్షేత్ర దర్శనమే సమస్త పాపాలను హరించి, పుణ్యరాశిని ప్రసాదిస్తుందని సెలవిచ్చారు. ఇంతటి విశిష్టమైన ఈ క్షేత్రాన్ని చేరుకోవడం కూడా ఆ స్వామి అనుమతితోనే జరుగుతుంది.
ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టడంతోనే తాము ఎంత అదృష్టవంతులమనే విషయం భక్తులకు అర్థమవుతుంది. దర్శనం అనంతరం ఇక్కడి స్వామివారిని విడిచి వెళ్లడానికి ఒక పట్టాన మనసొప్పదు. ఆ దివ్యమంగళమూర్తికి దూరంగా బతకడం సాధ్యమేనా అనిపిస్తుంది. అందుకే తల్లిని విడిచి వెళుతున్న బిడ్డలా ఆగి ఆగి వెనుదిరిగి చూస్తూ భక్తులు ముందుకు కదులుతుంటారు. కంటిరెప్పల వెనుక స్వామి రూపాన్ని పదిలపరచుకోవడానికి ప్రయత్నిస్తూ వుంటారు.