ఆసనం

ఆసనం
పూర్వం ఉపనయనం పూర్తి కాగానే పిల్లలను విద్యాభ్యాసం కోసం గురుకులానికి పంపించేవారు. దాదాపు యవ్వనంలోకి అడుగు పెట్టేంత వరకూ అక్కడ వారు విద్యను అభ్యసించేవారు. ఆ సమయంలో వారు ఆసనంగా 'కృష్ణ జింక' చర్మాన్ని ఉపయోగించడం ఆచారంగా వుండేది. బ్రహ్మచారులు కృష్ణజింక చర్మాన్ని ... సన్యాసులు 'పులి చర్మం'ఆసనంగా ఉపయోగించడమనే ఆచారం నేటికీ కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్నది.

కేవలం వస్త్రాలు మాసిపోకుండా వుండటం కోసం ...నేలపై కూర్చున్నందువలన శక్తిని కోల్పోకుండా వుండటం కోసమే కాదు, ఈ ఆచారం వెనుక ఆరోగ్యపరమైన కారణం వుంది. కృష్ణ జింక సాత్వీకమైన స్వభావాన్ని కలిగి వుంటుంది. అందువలన దీనిపై కూర్చోవడం వలన ఆశీనులపై సాత్వీకమైన ప్రభావం పడుతుంది. శరీరంలో నిరంతరం విద్యుత్ ఉత్పాదన ... విసర్జన జరుగుతూ వుంటాయి. దానిని నియంత్రించడంలో కృష్ణ జింక చర్మం తన వంతు పాత్రను పోషిస్తుందని ప్రాచీన కాలంలోనే నిరూపితమైంది.

ఇక ఆ కాలంలో అరణ్యాల సమీపంలో గురుకులాలు ఉండేవి. అడవులకు సంబంధించిన జంతువుల కారణంగా అక్కడి విద్యార్ధులకు వివిధ రకాల వ్యాధులు వచ్చేవి. విద్యార్ధులు అలాంటి వాటి బారిన పడకుండా కృష్ణ జింక చర్మం ఒక రక్షణ కవచంగా ఉపయోగ పడుతుందని గ్రహించిన పూర్వీకులు, దానిని ఆసనంగా ఉపయోగించడాన్ని ఆచారంగా చేశారు. ఇలా ప్రతి ఆచారంలోను మన పూర్వీకులు ఆరోగ్యపరమైన సూత్రములను ఇమిడ్చారు. కాలక్రమంలో విద్యావిధానంలోని మార్పుల కారణంగా ఇప్పుడీ పద్ధతి కనిపించనప్పటికీ, కొన్ని దైవకార్యాల్లో నేటికీ ఈ పద్ధతిని పాటిస్తూనే వస్తున్నారు.

More Bhakti Articles