ఏది అసలైన సౌందర్యం ?
ఒక రోజున విల్లిదాసు తన ప్రియసఖితో కలిసి శ్రీరంగంలో విహరిస్తుంటాడు. విల్లిదాసు శ్రీమంతుడు కావడం వలన, మహా సౌందర్యవతి అయిన తన ప్రియసఖి పాదాలు కందిపోకుండా దారి పొడవునా తివాచీలు పరిపిస్తూ ముందుకు సాగుతుంటాడు. ఆమె శరీరాన్ని సూర్యుడి కిరణాలు తాకకుండా గొడుగు పడుతుంటాడు. ఇక ఆయన చూపు ఎప్పుడూ ఆమె పైనే ఉంటూ వుంటుంది. ఆమె కళ్లలోకే చూస్తూ విల్లిదాసు నడుస్తుండటం గురించి అక్కడి ప్రజలు వింతగా చెప్పుకునేవారు.
ఒకసారి అలా బయటికి వచ్చిన ఆ జంటను రామానుజాచార్యులు చూస్తాడు. చుట్టుపక్కల వాళ్లు నవ్వుతున్నా ఆ జంట పట్టించుకోకపోవడం, తాము మరేదో లోకంలో ఉన్నట్టుగా వాళ్లు వ్యవహరించడం రామానుజాచార్యుల వారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దాంతో ఆయన తన శిష్యులతో విల్లిదాసును తన దగ్గరికి పిలిపిస్తాడు. రామానుజాచార్యుల వారిని సమీపిస్తూనే విల్లిదాసు వినయంగా నమస్కరిస్తాడు.
ఆమె కళ్లలోకే చూస్తూ ఆయన నడవడానికి కారణమేమిటని రామానుజాచార్యులువారు అడుగుతాడు. ఈ ప్రపంచంలోని సౌందర్యమేదైనా ఉందంటే అది ఆమేననీ, అద్భుతంగా తీర్చిదిద్దబడిన ఆమె కళ్లలోకి చూస్తుంటే ఆకలిదప్పులు తెలియడంలేదని చెబుతాడు విల్లిదాసు. ఇంతవరకూ తాను అంతటి సౌందర్యాన్ని చూడలేదని అంటాడు. అంతకుమించిన సౌందర్యం ఉందనీ ... తనవెంట వస్తే చూపిస్తానని చెబుతాడు రామానుజాచార్యులు. ఆ మాటకి ఆశ్చర్యపోతూ విల్లిదాసు ఆయనను అనుసరిస్తాడు.
రంగనాథస్వామి ఆలయంలోకి ఆయనని తీసుకువెళ్లి మూలమూర్తి రూపాన్ని చూపిస్తాడు రామానుజాచార్యులు. స్వామివారి సమ్మోహన రూపాన్ని దర్శించిన విల్లిదాసు, అసలైన సౌందర్యమంటే ఆయనదేనని అంగీకరిస్తాడు. వ్యామోహంతో వాస్తవాన్ని గ్రహించలేకపోయిన తన కళ్లను తెరిపించారంటూ రామానుజులవారి పాదపద్మాలకు నమస్కరిస్తాడు. ఆ క్షణం నుంచి ఆయన రంగనాథుడి భక్తుడిగా మారిపోయి అనుక్షణం ఆయన సేవలో తరించాడు.