ఆదిదేవుడికి అమ్మగా మారిపోయిన భక్తురాలు
శివభక్తులందరూ బెజ్జమహాదేవికి అగ్రస్థానం ఇస్తుంటారు. ఆమె తరువాతనే తామంతా అని చెప్పుకుంటూ ఉంటారు. అలా అని ఆమె సదాశివుడిపై రచనలు చేయలేదు ... పరమశివుడిని గురించి పరవశిస్తూ పాడనూ లేదు. అక్షర జ్ఞానమేలేని ఆమెలో అన్ని విధాలా అమాయకత్వమే కనిపిస్తూ ఉండేది. ఊహ తెలిసిన నాటినుంచి ఆమె శివుడిని ఎంతగానో అభిమానిస్తూ ఉండేది. వయసుతో పాటే ఆయనపట్ల ఆమె భక్తి శ్రద్ధలు పెరుగుతూ వచ్చాయి.
అలాంటి దశలోనే ఆమెకి ఒక ఆలోచన వస్తుంది. అప్పటివరకూ తనకి ఆ ఆలోచన తట్టనందుకు తనని తాను నిందించుకుంటుంది. తల్లి లేక పోవడం వలన శివుడు ఎంతగా తల్లడిల్లిపోతున్నాడో అనేదే ఆమె ఆలోచన. ఈ ఆలోచన రాగానే బాధతో ఆమె విలవిలలాడిపోతుంది. నిజంగా ఆయనకి తల్లే గనుక ఉంటే పులిచర్మాన్ని ధరిస్తే చూస్తూ ఊరుకునేదా ? స్మశానంలో తిరగనిచ్చేదా ? జుట్టు జడలు కట్టనిచ్చేదా ? విషాన్ని మింగనిచ్చేదా ? అనుకుంటూ బెజ్జమహాదేవి కన్నీళ్ల పర్యంతమవుతుంది.
శివుడికి తల్లిలేని లోటు తెలియకూడదనీ, ఇక నుంచి తానే తల్లిగా మారి శివుడి ఆలనా పాలన చూసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఆ క్షణం నుంచి తను ఆరాధిస్తోన్న శివలింగాన్నే బాల శివుడిగా భావిస్తూ అన్ని రకాల సేవలు చేయసాగింది. తనని పసివాడిగా భావిస్తూ ఆమె స్నానం చేయించడం ... పాలుపట్టడం ... గోరుముద్దలు తినిపించడం చూసిన శివుడు నిజంగానే వాటిని స్వీకరించడం మొదలుపెట్టాడు. ఆమె ముద్దు చేస్తూ మురిపెంగా చూస్తూ ఉంటే మురిసిపోయాడు.
అలా కొంతకాలం గడిచాక తన పట్ల ఆమెకి గల వాత్సల్యాన్ని పరీక్షించాలని ఆయన నిర్ణయించుకుంటాడు. ఒకరోజున పాలు తాగకుండా ... గోరుముద్దలు తినకుండా ఉండిపోయాడు. దాంతో బాలశివుడికి సుస్తీ చేసిందని భావించిన ఆమె ఏం చేయాలో పాలుపోక తీవ్రమైన ఆందోళన చెందుతుంది. బిడ్డ పరిస్థితిని చూస్తూ తాను బతికి ఉండటమే అనవసరమని ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడుతుంది.
ఆమె వాత్సల్య భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై, తల్లి ప్రేమలోని మాధుర్యాన్ని రుచి చూపినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. తల్లి ఉన్న కారణంగా ఇక నుంచి తాను కూడా అదృష్టవంతుడనేనని అంటాడు. తనకి తల్లి అయిన కారణంగా ఆమె 'అమ్మవ్వ' పేరుతో పిలవబడుతుందని వరాన్ని ఇస్తాడు. అలా బెజ్జమహాదేవి ... బెజ్జమవ్వగా ... అమ్మవ్వగా ముల్లోకవాసుల ప్రశంసలు అందుకుంది. ఆ తరువాత ఆదిదేవుడిలో ఐక్యమైపోయింది.