అసమాన భక్తురాలు అహల్యాబాయి
జీవితంలో కష్టసుఖాలు మబ్బు తెప్పల్లా వచ్చిపోతూనే ఉంటాయి. అయితే కష్టం వచ్చినప్పుడు దేవుడిచుట్టూ తిరగడం ... సుఖాలు రాగానే ఆ దేవుడిని మరిచిపోవడం జరుగుతుంటుంది. అలా కాకుండా కష్టాలలోను ... సుఖాలలోను భగవంతుడిని మించిన బంధువులేడని భావించేవారే నిజమైన భక్తులుగా చరిత్రలో నిలిచిపోతుంటారు. అలాంటివారిలో 'రాణీ అహల్యాబాయి' ఒకరని చెప్పుకోవచ్చు.
17వ శతాబ్దం తొలినాళ్లలో అహల్యాబాయి మహారాష్ట్రలోని చౌండీ గ్రామంలో జన్మించింది. బాల్యంలోనే ఆమెకి పరమశివుడిపట్ల అపారమైన భక్తిభావన కలుగుతుంది. అందువలన ఆమె తన గ్రామంలోని శివాలయంలోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉండేది. వయసుతోపాటే అహల్యాబాయికి ఆదిదేవుడి పట్ల ఆరాధనా భావం పెరుగుతూ వస్తుంది. ఆ సమయంలోనే ఆమె ఖండేరావు అనే రాజకుటుంబీకుడి కంటపడటం, ఆయనతో ఆమె వివాహం కావడం జరిగిపోతాయి.
అనూహ్యమైన విధంగా సుఖసంపదలు వచ్చిపడినా ఆమె శివుడిని ఎప్పటిలానే ఆరాధిస్తూ ఉండేది. ఆయన తరువాతనే అన్నీ ... ఆయన తరువాతనే అందరూ అన్నట్టుగా ఉండేది. అంతటి భక్తురాలు అనుకోని విధంగా భర్తను ... పిల్లలను ... శాశ్వతంగా కోల్పోవలసి వస్తుంది. ఆదిదేవుడి అనుగ్రహమే తప్ప సిరిసంపదలు శాశ్వతంకాదని మొదటినుంచి భావించే ఆమె, ఆ సదాశివుడిలో ఐక్యమైపోవాలని నిర్ణయించుకుంటుంది.
అయితే రాజ్యాన్ని సంరక్షిస్తానని మావగారికి ఇచ్చిన మాటకి కట్టుబడి ఆమె అధికారాన్ని చేపడుతుంది. తాను నామమాత్రంగా ఉంటూ పరమశివుడి పేరునే పరిపాలనా బాధ్యతలు నిర్వహిస్తూ ఉండేది. దానధర్మాలు చేయడంలోనూ ... ఆధ్యాత్మిక చింతనను పెంపొందింపజేయడంలోను తనకి సాటి మరొకరు లేరనిపించుకుంది. ప్రజలను కన్న బిడ్డలవలే ఆదరిస్తూ వాళ్లు ఆనందంగా ఉండటానికి అవసరమైన అన్ని రకాల అవకాశాలను ఆమె కల్పిస్తుంది.
మహేశ్వరంలో తన మనసుకి నచ్చిన విధంగా అద్భుతమైన రీతిలో శివాలయాన్ని తీర్చిదిద్దుతుంది. అంతేకాకుండా అనేక ప్రాంతాలలోని శివాలయాలను అభివృద్ధిపరుస్తూ, ఆదిదేవుడి పట్ల తనకి గల అభిమానాన్ని చాటుకుంది. అసమాన భక్తురాలిగా అందరి హృదయాలలోను చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకోగలిగింది.