గ్రహదోషాలు నివారించే సదాశివుడి క్షేత్రం
సాధారణంగా శైవ క్షేత్రాల్లో ఒక శివలింగం కానీ ... క్షేత్ర ప్రాధాన్యతను బట్టి మరికొన్ని శివలింగాలు గాని దర్శనమిస్తూ వుంటాయి. ఇక విశేషమైనటువంటి క్షేత్రాల్లో వేయి శివలింగాలు దర్శనమిస్తూ వుంటాయి. ఇలాంటి క్షేత్రాల్లో ప్రధానమైన శివలింగం పెద్దదిగా వుండి ... మిగతా శివలింగాలు చాలాచిన్నవిగా కనిపిస్తుంటాయి.
ఇందుకు భిన్నంగా వేయి నూటాపదహారు శివలింగాలు ఒకే పరిమాణాన్ని కలిగిన క్షేత్రంగా 'జమ్ములపాలెం'విలసిల్లుతోంది. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో గల ఈ క్షేత్రంలో ఒకవేయి నూటాపదహారు శివలింగాలు దర్శనమిస్తూ వుంటాయి. ప్రధానమైన 'పంచముఖ' శివలింగానికి మాత్రమే పైకప్పు వుంటుంది. మిగతా శివలింగాలు ఆరుబయటే పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాయి. ప్రతి శివలింగం నాగపడగను కలిగి వుండటం ఇక్కడి ప్రత్యేకత.
ఈ క్షేత్రానికి వచ్చిన వాళ్లు ముందుగా గణపతిని పూజించి ఆ తరువాత శివలింగాలను దర్శించుకుంటారు. శేషమాంబ అనే ఓ భక్తురాలి సంకల్ప బలం కారణంగా ఇక్కడ ఈ క్షేత్రం ఆవిర్భవించింది. ఈ క్షేత్రాన్ని దర్శించిన వాళ్లు గ్రహదోషాల బారి నుంచి బయటపడతారని చెబుతారు. వివిధ రకాల దోషాలతో ఇబ్బందులు పడుతోన్నవాళ్లు ఇక్కడి పంచముఖ శివుడికి అభిషేకాలు నిర్వహించి అనుగ్రహాన్ని పొందుతుంటారు.