శివుడి శాపంతో పక్షులైన మహర్షులు
విశిష్టమైనటువంటి కొన్ని పుణ్యక్షేత్రాలలో పాములకు సంబంధించి ... పక్షులకు సంబంధించి చిత్రమైన సంఘటనలు కనిపిస్తుంటాయి. అది దైవలీలగా ... క్షేత్ర మహిమగా భక్తులు చెప్పుకుంటూ వుంటారు. గత చరిత్రగానే కాదు ... ప్రస్తుతం ఆ సంఘటనలు ప్రత్యక్షంగా కనిపిస్తూ వుండటం వలన అందరూ విశ్వసిస్తూ వుంటారు. అలాంటి సంఘటన ఒకటి తమిళనాడు ప్రాంతంలోని 'తిరుక్కలి కుండ్రం' క్షేత్రంలో కనిపిస్తుంది.
అత్యంత ప్రాచీనమైన ఈ క్షేత్రంలో పరమశివుడు 'వేదగిరీశ్వరుడు' పేరుతోను ... పార్వతీదేవి 'త్రిపుర సుందరి' పేరుతోను పూజాభిషేకాలు అందుకుంటూ వుంటారు. భరద్వాజ మహర్షికి శివుడు వేదాలను ప్రసాదించిన కారణంగా ఇక్కడి శివుడికి వేదగిరీశ్వరుడు అనే పేరు వచ్చిందని చెబుతారు. కొండపైన స్వామివారు ... కొండ దిగువున పార్వతీదేవి కొలువుదీరి వుండటం ఇక్కడి విశేషం.
ఇక ఈ క్షేత్రాన్ని 'పక్షితీర్థం' అని కూడా పిలుస్తుంటారు. ప్రతినిత్యం మధ్యాహ్న సమయంలో రెండు గరుడపక్షులు కొండపైకి చేరుకుంటాయి. ఉదయం స్వామికి నివేదన చేసిన ప్రసాదాన్ని అర్చకులు కొండపై ఒకచోట ఉంచుతారు. గోధుమపిండి ... పంచదార ... నెయ్యితో తయారు చేసిన ఆ ప్రసాదాన్ని పక్షులు ఆరగించి వెళతాయి. వందల సంవత్సరాలుగా జరుగుతున్నట్టు చెప్పబడుతోన్న మహిమాన్వితమైన ఈ సంఘటనను చూడటానికి వేల సంఖ్యలో యాత్రికులు వస్తుంటారు.
ఇన్ని వందల సంవత్సరాలుగా వస్తున్నవి అవే పక్షులు కావడం ఆశ్చర్యకరం. పూర్వం శివాగ్రహానికి గురైన ఇద్దరు మహర్షులు ఇలా పక్షులుగా మారిపోయారనీ , శాపవిమోచనం కోసమే ఆ పక్షులు ప్రతినిత్యం శివప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటాయని స్థలపురాణం చెబుతోంది.