సకల దోషాలను హరించే సన్నిధానం
జీవితంలో ఎదగడానికి అందరూ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అందుకు పూర్వజన్మలో చేసిన పాపాలు ... పెద్దల శాపాలు అడ్డుపడుతూ వుంటాయి. ఈ కారణంగా అడుగడుగునా అవరోధాలు ఎదురుకావడం ... అసహనానికి గురిచేయడం జరుగుతుంటుంది. దర్శనం మాత్రం చేతనే అలాంటివారి దోషాలను నివారించే క్షేత్రం మనకి హైదరాబాద్ - మూసారాంబాగ్ లో కనిపిస్తుంది.
ఇక్కడి ఆలయంలో ప్రధాన దైవంగా లక్ష్మీదేవి - గోదాదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి వారు దర్శనమిస్తూ వుంటారు. గర్భాలయంలో స్వామివారు ఒక్కరే నిలువెత్తుమూర్తిగా కొలువై వుండగా, ప్రత్యేక మందిరాలలో అమ్మవార్లు పూజలు అందుకుంటూ వుంటారు. శుక్రవారం రోజున అమ్మవార్లకి కుంకుమ పూజలు ... శనివారం రోజున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.
కంచి కామకోటి పీఠం వారి అధీనంలో గల ఈ క్షేత్రంలో నిత్యోత్సవాలు మొదలు వార్షికోత్సవాల వరకూ ఘనంగా నిర్వహిస్తుంటారు. స్వామివారి వైభవాన్ని ఆవిష్కరించే ఈ ఉత్సవాల్లో అశేష భక్త జనులు పాల్గొంటూ వుంటారు. ఈ ఉత్సవాల సందర్భంగా జరిగే వివిధ వాహన సేవలను ... అద్దాల మంటపంలో జరిగే పవళింపు సేవను చూడటానికి రెండుకళ్లు సరిపోవు.
ప్రశాంతతను ప్రసాదించే ఈ క్షేత్రంలో శివపార్వతులు ... గణపతి ... సుబ్రహ్మణ్యస్వామి ... దాసాంజనేయస్వామి ... వేణుగోపాలస్వామి ప్రత్యేక మందిరాలలో కొలువై భక్తులను అనుగ్రహిస్తూ వుంటారు. సుబ్రహ్మణ్యస్వామి లింగరూపంలో దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. ఈ క్షేత్రాన్నిదర్శించడం వలన సమస్త దోషాలు తొలగిపోతాయనీ, ఆశించిన ఫలితాలు దక్కుతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.