పిలవగానే విగ్రహం నడిచొస్తుందా ?
భారతీయుల ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మహాభక్తులు ఎందరో వున్నారు. భగవంతుడితో నేరుగా మాట్లాడిన వారు ... ఆయనతో ఆటలాడిన వారు ... అవసరమైనప్పుడు ఆయనని ఆహ్వానించిన వారు ఈ జాబితాలో మనకి కనిపిస్తారు. అలాంటి మహా భక్తులలో ఒకరుగా శ్రీ రామానుజాచార్యులవారి గురించి చెప్పుకోవచ్చు.
రామానుజాచార్యులు పిలవగానే చిన్ని కృష్ణుడు పరిగెత్తుకు వచ్చిన సంఘటన, భగవంతుడితో ఆయనకి గల అనుబంధాన్ని తెలియజేస్తూ వుంటుంది. కర్ణాటక ప్రాంతానికి చెందిన 'మేల్ కోట' క్షేత్రం అపూర్వమైన ఈ సంఘటనకు నేపథ్యంగా కనిపిస్తుంది. ఒకరోజు రాత్రి శ్రీ రామానుజుల వారి కలలో మేల్ కోట ఆలయంలో గల చిన్ని కృష్ణుడు దర్శనమిస్తాడు. తాను ఢిల్లీ సుల్తానుల చెంత ఉన్నాననీ ... తనని తిరిగి ఆలయానికి చేర్చమని చెబుతాడు.
దాంతో రామానుజుల వారు మరునాడు ఉదయం సుల్తాన్ నివాస భవనానికి వెళ్తాడు. ఆ సమయంలో ఆయన కూతురు చిన్ని కృష్ణుడి విగ్రహాన్ని పూలతో అలంకరించి ఆడుకుంటోంది. గుడి నుంచి తెచ్చిన కృష్ణుడి ప్రతిమను తిరిగి అక్కడికి చేర్చడం అన్ని విధాలా మంచిదని సుల్తాన్ తో చెబుతాడు రామానుజాచార్యులు. తన కూతురు మారాం చేస్తుందని గ్రహించిన సుల్తాన్, కృష్ణుడు వస్తే తీసుకెళ్లమని అంటాడు.
దాంతో రామానుజుల వారు కృష్ణుడి విగ్రహానికి ఎదురుగా కూర్చుని, ''కన్నయ్యా నువ్వు రావాలేగానీ మేల్ కోట ఆలయానికి తీసుకువెళ్లడానికి నీను సిద్ధంగా వున్నాను '' అన్నాడట. అంతే అందరూ చూస్తుండగానే కృష్ణుడి విగ్రహం దానంతట అది నడచుకుంటూ రామానుజాచార్యుల వారి చెంతకు వస్తుంది. మహిమాన్వితమైన ఈ సంఘటనను చూసిన ఢిల్లీ సుల్తాన్ ఆశ్చర్యపోతాడు.
శ్రీకృష్ణుడు ఆ విగ్రహంలో ప్రత్యక్షంగా ఉన్నాడని గ్రహించి, ఆ విగ్రహాన్ని రామానుజాచార్యుల వారికి అప్పగించి సగౌరవంగా సాగనంపుతాడు. అలనాడు అంతటి మహిమను చూపిన చిన్ని కృష్ణుడు ఇప్పటికీ ఇక్కడి ఆలయంలో దర్శనమిస్తూ వుంటాడు ... ధన్యులను చేస్తూ వుంటాడు.