శ్రీ కృష్ణుడి అష్టసతుల కుమారులు
శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాలలో రామావతారానికి ఎంతో విశిష్టత వుంది. శ్రీమహావిష్ణువు ధరించిన ఈ అవతారంలో లక్ష్మీదేవి ... సీతాదేవిగా అవతరించింది. ఈ అవతారంలో సీతమ్మ వారు భర్తకు దూరమై నానాకష్టాలు పడుతుంది. తనకే కాదు లోకంలో ఏ స్త్రీకి కూడా అలాంటి కష్టాలు ఎదురుకావొద్దని అనుకుంది. ఇకపై భర్తతో తనకి ఏ విధంగాను ఎడబాటు కలగకుండా చేయమని జగజ్జననిని లక్ష్మీదేవి ప్రార్ధిస్తుంది. ఆమె ఆవేదనను జగజ్జనని అర్థం చేసుకుంది.
లక్ష్మీదేవిని అమ్మవారు అనుగ్రహించిన కారణంగానే, అష్ట లక్ష్ములు శ్రీ కృష్ణుడి అష్ట భార్యలుగా అవతరించారని చెప్పబడుతోంది. 'రుక్మిణీ దేవి' గా ఆదిలక్ష్మి .. ' సత్యభామ' గా ధైర్యలక్ష్మీ .. ' జాంబవతి' గా ధాన్యలక్ష్మి .. 'కాళింది' గా గజలక్ష్మీ .. 'భద్ర' గా ధనలక్ష్మీ .. 'నాగ్నజితి' గా సంతాన లక్ష్మీ .. 'మిత్రవింద' గా విజయలక్ష్మీ .. 'లక్షణ' గా విద్యాలక్ష్మీ అవతరించారు.
విధి ముందుగానే నిర్ణయించినా శ్రీ కృష్ణుడు ఒక్కొక్కరినీ ఒక్కో సందర్భంలో వివాహమాడతాడు. ఇక ఈ అష్ట సతులకు శ్రీ కృష్ణుడి కారణంగా అష్టసుతులు కలిగారు. రుక్మిణీకి 'ప్రద్యుమ్నుడు' .. సత్యభామకి 'సుభానుడు' .. జాంబవతికి 'సాంబుడు' .. కాళిందికి 'భద్రుడు' .. భద్రకి 'సుభద్రడు' .. నాగ్నజితికి 'వీరుడు' .. మిత్రవిందకి 'అపరాజితుడు' .. లక్షణకి 'సోమకుడు' అనే కుమారులు జన్మించారు.