సౌభాగ్యాన్ని అనుగ్రహించే అమ్మవారు
సౌభాగ్యాన్ని మించిన సంపదలేదని స్త్రీలు భావిస్తుంటారు. తమ సౌభాగ్యం సుస్థిరంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఎన్నో పూజలు ... వ్రతాలు చేస్తుంటారు. అమ్మవారి క్షేత్రాలను దర్శించి తమ మనసులోని మాటను చెప్పుకుంటారు. ఆ తల్లి సంతోషం కోసం ... తమ సంతృప్తి కోసం కుంకుమ పూజలు నిర్వహిస్తుంటారు. అమ్మవారికి చీరసారెలు కానుకలుగా సమర్పిస్తూ వుంటారు.
సర్వమంగళ అయిన అమ్మవారే వివిధ రూపాల్లో కొలువై వుంటుంది గనుక, ఆ తల్లి తనని విశ్వసించిన వారి పసుపు కుంకుమలను సదా కాపాడుతూ వుంటుంది. అలా 'చాముండేశ్వరీ' పేరుతో అమ్మవారు తన భక్తులను అనుగ్రహించే క్షేత్రం మెదక్ జిల్లా 'చిట్కుల్' లో కనిపిస్తుంది. సాధారణంగా అమ్మవారి ఆలయాల్లో మూలమూర్తి కూర్చుని దర్శనమిస్తూ వుంటుంది. ఒకవేళ మూలమూర్తులు నుంచుని ఉన్నప్పటికీ వాటి పరిమాణం భారీగా వుండదు.
అందుకు భిన్నంగా ఇక్కడి ఆలయంలో నుంచున్న అమ్మవారి మూలమూర్తి 11 అడుగుల ఎత్తును కలిగి వుంటుంది. నవదుర్గల అంశావతారంగా అమ్మవారు 18 చేతులను కలిగి వుంటుంది. విశాల నేత్రాలను ... చక్కని ముక్కెరను కలిగిన అమ్మవారిలో జీవం ఉట్టిపడుతూ వుంటుంది. అమ్మవారే సాక్షాత్కరించిందా? అన్నట్టుగా ఆ తల్లి దర్శనమిస్తూ వుంటుంది. ఇక్కడ అమ్మవారి పాదాలకే నేరుగా కుంకుమ పూజ చేయడాన్ని విశేషంగా చెబుతుంటారు.
అమ్మవారిని అంకిత భావంతో ఆరాధించడం వలన ఐదవతనాన్ని కాపాడుతూ ఉంటుందనీ, ముఖ్యంగా ఇక్కడి అమ్మవారి ప్రత్యేకత అదేనని అంటారు. ఆశ్వీయుజ ... కార్తీక ... మాఘ మాసాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు - విశేష ఉత్సవాలు నిర్వహిస్తూ వుంటారు. ఈ సందర్భంగా ఎంతోమంది భక్తులు అమ్మవారిని దర్శించి, ఆ తల్లి ఆశీస్సులు అందుకుంటూ వుంటారు.