సంతానాన్ని ప్రసాదించే మల్లికార్జునుడు
కాకతీయుల పరిపాలనా కాలంలో అనేక ప్రాంతాలలో శివాలయాలను నిర్మించారు. అంతకు పూర్వం నుంచి గల శివాలయాలను పునరుద్ధరించారు. అలా ఆదిదేవుడి పట్ల తమకి గల అభిమానాన్ని చాటుకున్నారు. కాకతీయుల నిర్మించిన శివాలయాలను వెంటనే గుర్తించ వచ్చు. ఎందుకటే శిల్పకళ ద్వారా ఆలయ నిర్మాణం పైనా ... శివలింగాన్ని అందంగా రూపొందించడంలోను వాళ్లు తమదైన ప్రత్యేక ముద్ర వేశారు. కాకతీయులు నిర్మించిన ... అభివృద్ధి పరిచిన ఆలయాలు శివుడిపై వారికి గల అసమానమైన భక్తి శ్రద్ధలకి నిలువెత్తు నిదర్శనంలా కనిపిస్తుంటాయి.
ఈ నేపథ్యంలో నిర్మించబడిన 'సంతాన మల్లికార్జున స్వామి' ఆలయం మెదక్ జిల్లా 'మర్పడక' గ్రామంలో దర్శనమిస్తుంది. సంతాన లేమితో బాధపడుతోన్న ఎంతో మందికి ఇక్కడి స్వామిని దర్శించాక ఆ లోటు తీరిపోయింది. ఈ కారణంగానే ఇక్కడి మల్లికార్జునుడికి సంతాన మల్లికార్జునుడు అనే పేరు వచ్చిందని అంటారు. స్వామి అనుగ్రహంతో కలిగిన సంతానానికి ఆయన పేరే పెడుతూ వుండటం విశేషం.
ఆలయం కాకతీయుల కాలంలో నిర్మించబడినా ... శివలింగం మాత్రం స్వయంభువు అని స్థలపురాణం చెబుతోంది. ఇక స్వామివారిని చూస్తూ ఆయనకి ఎదురుగా కనిపించే నంది, ఓ పక్కకి తిరిగి వుంటుంది. ఈ నంది మహిమాన్వితమైనదనీ ... ఒకసారి ఆలయంలోకి దొంగలురాగ పెద్దగా రంకె వేసి గ్రామ ప్రజలను మేల్కొలిపిందని చెబుతారు. ఆ సందర్భంలోనే నంది ఇలా ఓ పక్కకి తిరిగిందని అంటారు.
ఈ నందీశ్వరుడు తమ గ్రామాన్ని ఓ కంట కనిపెడుతూ ఉంటాడని గ్రామస్తులు భావిస్తుంటారు. ఈ కారణంగా శివయ్యతో పాటు నందీశ్వరుడికి కూడా పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఇక మరో విశేషం ఏమిటంటే ... విశేషమైన పుణ్య తిథుల్లో ఓ సర్పం స్వామివారిని దర్శించి వెళుతుంది. ఆశ్చర్య చకితులను చేసే ఈ దృశ్యాన్ని చూడటానికి వచ్చే వారి సంఖ్య కూడా ఎక్కువగానే వుంటుంది.