దారి చూపిన దేవుడు !
దేవుడు తన భక్తులను ఓ కంట కనిపెడుతూనే వుంటాడు. తన భక్తుల ఆపదలు ... అవసరాలు తెలుసుకుని ఇతరుల ద్వారా వారికి సహాయ సహకారాలు అందేలా చూస్తాడు. తప్పనిసరి పరిస్థితుల్లో తానే మారువేషాల్లో రంగంలోకి దిగుతాడు. అయోమయానికి లోనైన తన భక్తులకు ఆశాదీపంలా కనిపించి ఓ దారి చూపుతాడు. ఇలాంటి సంఘటనే ఒకటి నల్గొండ జిల్లా నకిరేకల్ సమీపంలోగల 'పాలెం' గ్రామంలో చోటుచేసుకుంది.
పాలెం గ్రామం ప్రసిద్ధి చెందినటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో అలరారుతోంది. ఇక్కడ స్వామి వారు ఆవిర్భవించిన తీరు మహిమాన్వితంగా అనిపిస్తుంది. పూర్వం ఈ ప్రాంతానికి చెందిన జమీందారు కలలో నరసింహస్వామి కనిపించి, తన స్వయంభువు మూర్తి ఫలానా ప్రదేశంలో ఉందనీ ... దానిని బయటికి తీసి ప్రతిష్ఠించడం వలన అతని వంశం తరిస్తుందని చెప్పాడట.
కలలో స్వామివారు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం మరునాడు ఉదయాన్నే ఆ జమీందారు అడవిలోకి బయలుదేరతాడు. కొంతదూరం వెళ్లాక దారెటో తెలియక అయోమయానికి లోనవుతాడు. అదే సమయంలో ఓ వ్యక్తి అటుగా రావడంతో, తనకి వచ్చిన కల ... అందులోని ఆనవాళ్లు అతనికి చెబుతాడు జమీందారు. దూరంగా వున్న ఒక చెట్టుపై ప్రదక్షిణ క్రమంలో తిరుగుతున్న గరుడ పక్షిని ఆ వ్యక్తి జమీందారుకి చూపిస్తాడు. ఆ చెట్టు మొదట్లో గల పొదల్లో స్వామివారి విగ్రహం ఉంటుందని చెబుతాడు.
ఆనందంతో రెండు అడుగులు ముందుకు వేసిన జమీందారు, ఆ వ్యక్తికి కృతజ్ఞతలు తెలుపుదామని వెనుదిరిగి చూడగా అక్కడ ఆయన లేడు. భగవంతుడే ఆ రూపంలో తనకి దారిచూపాడనే విషయం ఆ జమీందారుకి అర్థమవుతుంది. గరుడపక్షి గల ఆ చెట్టును గుర్తు పెట్టుకుని వెళ్లిన ఆయనకి అక్కడ లక్ష్మీనరసింహస్వామి విగ్రహం లభిస్తుంది. అలా వెలుగు చూసిన లక్ష్మీనరసింహస్వామి, నేడు అశేష భక్తజనుల ఇలవేల్పుగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు.