కలలు చెప్పే ఫలితాలు
కొన్ని సమయాల్లో వచ్చే కొన్ని కలలు నిజమవుతాయని స్వప్న శాస్త్రం చెబుతోంది. అయితే ఏ కల వలన ఎలాంటి ఫలితం వస్తుందో తెలియక చాలామంది ఆందోళన చెందుతూ వుంటారు. పూర్వం మహారాజులు స్వప్న శాస్త్రం తెలిసినవారిని తమ ఆస్థానంలో నియమించేవారు. రాజ కుటుంబీకులకి వచ్చిన కలలకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది ఆ పండితులు వివరించే వాళ్లు. దీనిని బట్టి కలల వలన ఫలితాలు ఉంటాయనే విశ్వాసం ఆనాటి నుంచి ఉందనే విషయం అర్థమవుతుంది.
సాధారణంగా పంచభూతాలనబడే నింగి .. నేల .. నీరు .. నిప్పు .. గాలి కలలో కనిపిస్తూ వుంటాయి. ఈ పంచభూతాలలో ఒక్కొక్కటి కలలో కనిపించిన తీరును బట్టి ఫలితాలు వుంటాయి. ఆకాశం దట్టమైన మబ్బులు కమ్ముకుని కలలో కనిపిస్తే, త్వరలో కష్టాలు ప్రారంభం కానున్నట్టుగా గ్రహించాలి. సమస్యల్లో చిక్కుకోబోతున్నారనే విషయాన్ని ఈ విధమైన కల ముందుగానే సూచిస్తూ వుంటుంది. ఇక అదే ఆకాశం నిర్మలంగా కనిపిస్తే పరిస్థితులు మెరుగుపడతాయని భావించాలి.
ఇక కలలో ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తే సిరిసంపదలతో జీవితం సంతోషంగా వుంటుందని తెలుసుకోవాలి. అందుకు భిన్నంగా గడ్డి మొక్క కూడా మొలవని నేల కనిపించడం దారిద్ర్యం తరుముకు రానుందనే విషయాన్ని చెబుతుంది. కలలో స్వచ్చమైన నీటి ప్రవాహాలు కనిపించడం వలన ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అందుకు భిన్నంగా మురుగు నీరు కనిపిస్తే ధన నష్టం జరుగుతుంది.
ఇక కలలో మంటలు కనిపించడం అశుభాన్ని సూచిస్తుంది. ఆ మంటలు క్రమేపి తగ్గిపోయి బూడిద కనిపించడం కూడా చెడు ఫలితాన్నే ఇస్తుంది. ఇక ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన కలలో రావడం, త్వరలో ఎదురుకానున్న కష్టాలను సూచిస్తూ వుంటుంది. మనసుకి ఆందోళన కలిగించే కలలు వచ్చినప్పుడు ఇష్టదేవతారాధన చేయాలి. అందువలన మానసిక ప్రశాంతత లభిస్తుంది ... కీడు ప్రభావం తగ్గిపోతుంది.