భక్తుడి కోసం దిగివచ్చిన దేవుడు
పాండురంగస్వామి భక్తులలో తుకారామ్ ముందువరుసలో కనిపిస్తాడు. తుకారామ్ జీవితాన్ని పరిశీలిస్తే ఆయనకి స్వామివారి పట్ల గల భక్తిశ్రద్ధలు ఏ పాటివో తెలుస్తుంది. ఈ విషయాన్ని నిరూపించే ఓ సంఘటన కూడా ఆయన జీవితంలో జరిగింది. తుకారామ్ ని దోషిగా నిలబెట్టాలనే ఉద్దేశంతో కొందరు గర్భాలయంలోని పాండురంగడి మూలమూర్తిని పెకిలించి బావిలో పడేస్తారు. తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడం కోసం తుకారామ్ ప్రార్ధించగా అందరూ చూస్తుండగానే స్వామివారి మూర్తి గర్భాలయంలో ప్రత్యక్ష్యమవుతుంది.
19వ శతాబ్దం తొలినాళ్లలో ఇలాంటి సంఘటన ఒకటి 'నరసింహం' అనే భక్తుడి విషయంలోనూ జరిగింది. కృష్ణా జిల్లా 'చిలకలపూడి' మహిమాన్వితమైన ఈ సంఘటనకు వేదికగా కనిపిస్తుంది. నరసింహం అనే భక్తుడు నిరంతరం స్వామి భజన చేస్తూ ఉండేవాడు. ఆయన భక్తికి మెచ్చిన పాండురంగడు, ఆలయాన్ని నిర్మిస్తే తాను అందులో ఆవిర్భవిస్తానని చెబుతాడు. దాంతో నరసింహం అతికష్టం మీద మంచి స్థలాన్ని చూసుకుని అక్కడ ఆలయాన్ని నిర్మిస్తాడు.
మంచి ముహూర్తం చూసుకుని ... ఆ సమయంలో ఆవిర్భవించమని స్వామికి చెప్పుకుంటాడు. స్వామి తనకి మాటిచ్చిన విషయాన్ని గ్రామస్తులకు చెబుతాడు. దాంతో గ్రామస్తులందరూ అద్భుతమైన ఆ ఘట్టాన్ని తిలకించేందుకు ఆలయానికి చేరుకుంటారు. ఈ తతంగమంతా నాటకమంటూ ఆంగ్లేయ అధికారులు గ్రామస్తులను నిలువరిస్తారు. ఖాళీగా వున్న గర్భాలయానికి తాళం వేసి అక్కడి నుంచి నరసింహాన్ని పంపించివేసేందుకు ప్రయత్నించసాగారు. అంతలో పిడుగు పడినట్టుగా పెద్ద శబ్దం వినిపిస్తుంది.
గర్భాలయంలో నుంచి ఆ శబ్దం రావడంతో ఆంగ్లేయ అధికారులు తిరిగి తలుపులు తెరచిచూస్తారు. గర్భాలయంలో అప్పటివరకూ ఖాళీగా వున్న వేదికపై పాండురంగ స్వామి విగ్రహం కనిపించడంతో తమ కళ్లను తామే నమ్మలేకపోతారు. మన్నించమంటూ వాళ్లు నరసింహాన్ని కోరడమే కాకుండా, గ్రామస్తులు దర్శనం చేసుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తారు. ఆనాటి నుంచి ఈ క్షేత్రం అశేష భక్తజనులను అనుగ్రహిస్తూ మహిమాన్వితమైనదిగా ప్రసిద్ధి చెందింది.