కష్టపడి సంపాదించిన సొమ్ముకు కాళ్లురావు
అడవినే ఆవాసంగా చేసుకున్న మాణిక్య ప్రభువుల వారు అక్కడ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుండేవారు. ఆయనని దర్శించి తమ జీవితంలోని దుఃఖాన్ని పోగొట్టుకోవాలనుకునే వాళ్లు అడవికి భయపడకుండా ఆయన చెంతకు చేరుకునేవారు. ప్రభువుల వారు అడవిలో కొలువుదీరడం ... ఆయన కోసం ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తూ వుండటం ఆ ప్రాంతంలోని దొంగలకు ఆనందాన్ని కలిగిస్తుంది.
సాధారణంగా ఆ అడవిలోకి ఎప్పుడో గాని ఎవరో ఒకరు వచ్చే వారు కాదు. అలా వచ్చినప్పుడే ఈ దొంగలు దారి దోపిడీకి పాల్పడుతూ వుండేవాళ్లు. అలాంటిది ఇప్పుడు చాలామంది అడవికి వస్తూ వుండటం వాళ్లకి సంతోషాన్ని కలిగిస్తుంది. ఒకరోజు రాత్రి మాణిక్య ప్రభువుల వారు వుండే ప్రదేశానికి దొంగలు చేరుకుంటారు. అక్కడ ప్రభువుల వారితో పాటు ఆయన దర్శనం కోసం వచ్చిన వాళ్లు కూడా నిద్రిస్తుంటారు. అదే మంచి అదనుగా భావించిన దొంగలు ఆ భక్తుల వంటిపై గల నగలను ఒలుచుకుని వెళ్లిపోతారు.
ఆ వెంటనే ఓ భక్తుడికి మెలకువరావడంతో జరిగింది గ్రహిస్తాడు. అతని అరుపులతో అందరూ నిద్రలేచి తమ బంగారు వస్తువులు పోయినట్టు తెలుసుకుంటారు. వాళ్లు చేస్తోన్న హడావిడికి ప్రభువుల వారికి కూడా మెలకువ వస్తుంది. జరిగినదంతా వాళ్లు ప్రభువుల వారితో చెప్పి ఆవేదనను వ్యక్తం చేస్తారు. కంగారుపడవలసిన పనిలేదనీ ... కష్టపడి సంపాదించిన సొమ్ముకు కాళ్లు రావని ప్రభువుల వారు తాపీగా చెబుతారు. వాళ్లు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము దొంగలను మరింత కష్టపెట్టి వెనక్కి వస్తుందని అంటాడు.
మరునాడు ఉదయం అక్కడికి దగ్గరలో నుంచి అరుపులు వినిపిస్తూ ఉండటంతో, ఎవరో ఆపదలో వున్నారని భక్తులు అటుగా పరిగెడతారు. తమ దగ్గర నగలు దోచుకున్న దొంగలు ఓ పాడుబడిన నేలబావిలో పడివుండటం చూస్తారు. గాయపడిన వాళ్లని భక్తులు కాపాడి ప్రభువుల వారి దగ్గరికి తీసుకు వస్తారు. క్షమించమంటూ వాళ్లు ప్రభువుల పాదాలపై పడి, దోచుకున్న సొత్తును తిరిగి ఇచ్చేస్తారు. ఆ దొంగలకు చికిత్స చేయించిన ప్రభువుల వారు, హితవు చెప్పి వారి జీవన విధానాన్ని పూర్తిగా మార్చివేస్తారు.