అమరనాథ్ యాత్రలో అసలైన ఘట్టాలు
సమస్తమైన ఈ విశ్వాన్ని నడిపించే నాయకుడు ... విశ్వనాథుడు. అందమైన ఈ ప్రకృతిలో ప్రతి అడుగు ... ప్రతి అంశం ఆయన రూపాలను సంతరించుకుని కనిపిస్తుంటాయి. అనంతమైన ఆయన లీలలకు అద్దం పడుతుంటాయి. అలాంటి వాటిలో ఒకటిగా ... మహాశివుడి మహిమలకు నిదర్శనంగా 'అమర్ నాథ్ గుహ' కనిపిస్తుంది. ప్రతి యేటా 'శ్రావణపౌర్ణమి' నాటికి ఇక్కడి గుహలో ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించడానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు.
ఈ మంచు శివలింగాన్ని దర్శించడం వలన, పరమశివుడిని ప్రత్యక్షంగా పూజించిన ఫలితం దక్కుతుందని భక్తులు భావిస్తుంటారు. అందువల్లనే అతి కష్టతరమైన ఈ యాత్రను ఆనందంగా పూర్తి చేసి, మంచుతో కూడిన మహాశివుడి రూపాన్ని కన్నుల్లోను ... గుండెల్లోను దాచుకుని అనుభూతితో తిరిగి వస్తుంటారు. సదాశివుడు అమ్మవారికి సృష్టి రహస్యాన్ని వివరించింది ఈ గుహలోనేనని చెబుతారు. పార్వతీదేవిని వెంటబెట్టుకుని ఈ గుహకు బయలుదేరిన శివుడు, అమ్మవారికి తాను చెప్పే ఈ రహస్యం వేరెవరికీ తెలియకూడదనే ఉద్దేశంతో ఒక చోట 'నంది' ని ఆగిపోమ్మని చెప్పాడు.
అక్కడి నుంచి మరికొంత దూరం వెళ్లాక సిగలోని 'చంద్రుడు' ని కిందికి దింపేసి అక్కడే ఉండమని అన్నాడు. అలా ఇంకొంత దూరం నడిచాక మెడలోని 'నాగుపాము'ను తీసి ఆ ప్రదేశంలోనే ఉండిపొమ్మని చెప్పాడు. ఇంకాస్త ముందుకి వెళ్లాక గణపతిని కూడా వారించడంతో ఆయన అక్కడే ఆగిపోయాడు. మరి కొంత దూరం ప్రయాణించాక శివుడు తన అధీనంలో గల 'పంచభూతాలు'ను సైతం ఒకచోట వదిలి అమ్మవారితో కలిసి గుహ దిశగా ముందుకు కదిలాడు.
ఈ నేపథ్యంలో నందీశ్వరుడు ఆగిపోయిన ప్రదేశం 'బైల్ గామ్' పేరుతో ప్రసిద్ధి చెందింది. చంద్రుడిని ఉంచిన ప్రదేశం 'చందన్ వాడీ' పేరుతోను ... నాగుపాముని ఉంచిన ప్రదేశం 'శేష్ నాగ్' పేరుతోను అలరారుతున్నాయి. అలాగే గణపతి నిలబడిపోయిన ప్రదేశం 'మహాగుణస్ పర్వతం' పేరుతోను ... పంచభూతాలు నిలిచిన ప్రదేశం 'పంచ్ తరణి' పేరుతో విలసిల్లుతూ వుండటం విశేషం. ఇవన్నీ కూడా పార్వతీదేవితో కలిసి శివుడు ప్రయాణించిన మార్గాన్ని సూచిస్తూ, ఆయన అనుగ్రహాన్ని కోరి వస్తోన్న అశేష భక్తులకు ఆశీస్సులు అందజేస్తూ వుంటాయి.