వ్యాధిని మాయంచేసే కోనేటి తీర్థం
పుణ్యక్షేత్రాల్లో మట్టి దగ్గర నుంచి నీరు .. గాలి .. మొక్కలు మహిమాన్వితమైన విశేషాలను సంతరించుకుని కనిపిస్తాయి. ఈ కారణంగానే దైవదర్శనంతో పాటు, అక్కడి విశేషాల ద్వారా ఉపశమనాన్ని పొందడానికి భక్తులు ప్రయత్నిస్తుంటారు. కొన్ని క్షేత్రాల్లోని మట్టిని ఒంటికి పూసుకోవడం వలన చర్మ సంబంధిత వ్యాధులు తగ్గిపోతుంటాయి. మరికొన్ని క్షేత్రాల్లో గాలి పీల్చడం వలన శ్వాస సంబంధిత వ్యాధులు నయమవుతుంటాయి.
అలా ఓ క్షేత్రంలోని కోనేరులోగల నీటిని తీర్థంగా స్వీకరించడం వలన వివిధ రకాల రోగాలు నివారించబడతాయి. అదే మెదక్ జిల్లా 'మాధుర'లో గల శ్రీ దత్తాచలక్షేత్రం. దత్తాత్రేయస్వామి రెండవ అవతారంగా చెప్పబడుతోన్న 'శ్రీ నృసింహ సరస్వతి' నడయాడిన పుణ్యభూమి ఇది. ఇక ఆయన శిష్యుడుగా ప్రసిద్ధి చెందిన 'నామధారకుడు' ఈ ప్రదేశంలోనే తపస్సు చేసుకుని శ్రీ దత్తాత్రేయస్వామిలో ఐక్యమైపోయాడు. పరమ పవిత్రమైన ఈ ప్రదేశంలో అప్పటి నుంచి ఓ కోనేరు వుంది.
కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ప్రదేశంలో నామధారకుడు తపస్సుచేసుకుంటూ ఉండేవాడు. ఒక రోజున ఓ నవాబు తన కూతురిని వెంటబెట్టుకుని ఆయన దగ్గరికి వస్తాడు. 'రాచపుండు'తో తన కూతురు పడుతోన్న బాధను చూడలేక పోతున్నాననీ, ఆ బాధనుంచి ఆమెకు విముక్తి కల్పించమని కోరతాడు. అక్కడి కోనేటిలో గల నీటిని కొంతకాలం పాటు తీర్థంగా స్వీకరిస్తే ఫలితం కనిపిస్తుందని నామధారకుడు సమాధానమిస్తాడు.
ఆ విధంగా చేయడం వలన ఆ నవాబు కూతురు ఆ వ్యాధి బారి నుంచి బయటపడిందని స్థలపురాణం చెబుతోంది. అందువలన మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు ... దత్తానుగ్రహాన్ని పొందుతూ వుంటారు.