ఉత్తమగతులు కల్పించిన రామచంద్రుడు
యుద్ధభూమిలో లక్ష్మణుడికి ... మేఘనాథుడికి మధ్య పోరు భీకరంగా జరుగుతూ వుంటుంది. ఈ విషయం తెలుసుకున్న సులోచన, తన భర్త ప్రాణాలను కాపాడమని శ్రీ రామచంద్రుడికి మనసులోనే మొరపెట్టుకుంటూ ఆయన నామాన్ని స్మరిస్తూ వుంటుంది. శ్రీ రాముడిని స్మరించడమంటే మేఘనాథుడి శౌర్య పరాక్రమాలను తక్కువ చేసినట్టే అవుతుందని రావణాసురుడు తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తాడు.
ఆ విధంగా మేఘనాథుడిని అవమానపరచవద్దంటూ, సులోచన ధ్యానానికి రావణాసురుడు అడ్డుపడతాడు. ఫలితంగా యుద్ధభూమిలో మేఘనాథుడి శిరస్సు ఖండించబడుతుంది. భర్త మరణ వార్త తెలిసి సులోచన కన్నీళ్లు పెట్టుకుంటుంది. తన భర్తను బతికించమని రాముడిని కోరేందుకు యుద్ధభూమికి వెళుతుంది. యుద్ధభూమిలో పడి వున్న తన భర్త మొండెం చూసి బాధతో తల్లడిల్లి పోతుంది.
తన భర్త శిరస్సు కోసం అంతటా వెదికినా ప్రయోజనం లేకుండా పోతుంది. దాంతో చివరిసారిగా తన భర్త ముఖాన్ని చూసే భాగ్యాన్ని ప్రసాదించమని రామచంద్రుడిని ప్రార్ధిస్తుంది. సులోచన పాతివ్రత్యానికి కరిగిపోయిన రామలక్ష్మణులు, ఆమెకి భర్త శిరస్సును అందజేస్తారు. జరిగినదానికి గతంలో ఆమె తండ్రి మేఘనాథుడికి ఇచ్చిన శాపమే కారణమని చెబుతారు. ఆమె కోరికపై మేఘనాథుడికి కూడా పుణ్య లోకాలను అనుగ్రహిస్తారు. మేఘనాథుడిని విడిచి జీవించలేని ఆమెకి పుణ్యగతులు కల్పిస్తున్నట్టు చెబుతారు.