మహిమలు చూపుతోన్న మారుతీ క్షేత్రం
హనుమంతుడుని పూజించడం వలన సకల దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుంది. శని ప్రభావాన్ని సైతం హనుమంతుడి ఆరాధన తొలగిస్తుంది. ఈ కారణంగానే హనుమంతుడు అనునిత్యం అశేష భక్త జనులచే నీరాజనాలు అందుకుంటున్నాడు. అనేకమంది మహర్షుల ప్రార్ధనల మేరకు వివిధ ప్రాంతాల్లో స్వామి స్వయంభువు ఆవిర్భవించాడు.
కాలక్రమంలో స్వామి స్వయం వ్యక్త మూర్తులు కనుమరుగైపోగా, అనేక మహిమలు ప్రదర్శిస్తూ స్వామి తిరిగి వెలుగు చూసిన సందర్భాలు ఎన్నో వున్నాయి. అలాంటి మహిమలకు వేదికగా కర్నూలు జిల్లా నంద్యాలలోని హనుమంతుడి ఆలయం కనిపిస్తుంది. మహర్షుల అభ్యర్థన మేరకు ఆవిర్భవించిన హనుమంతుడు కాలక్రమంలో ఓ జాలరికి నదిలో లభించాడు. స్వామి విగ్రహ పరిమాణం పెరుగుతూ వుండటం ఆ జాలరి గమనించాడు.
విషయాన్ని ఆయన గ్రామస్తుల దృష్టికి తీసుకురావడంతో, అందరూ కలిసి స్వామికి ఆలయాన్ని నిర్మించారు. అలా కొన్ని వందల సంవత్సరాల నుంచి స్వామి ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. గర్భాలయంలో స్వామివారి నిలువెత్తు మూర్తి మహా తేజస్సుతో దర్శనమిస్తుంది. స్వామి ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకూ ఆయన చూపిమ మహిమలు అన్నీ ఇన్నీకావు. వాటిని గురించి భక్తులు కథలు కథలుగా చెప్పుకుంటారు.
ఇదే ప్రాంగణంలో సీతారాములు కూడా పూజలు అందుకుంటూ వుంటారు. ఇక్కడి రామలక్ష్మణులకు మీసాలు వుండటం గురించి విశేషంగా చెప్పుకుంటారు. ఇక్కడి స్వామిని ఆరాధించడం వలన ఆపదలు ... అనారోగ్యాలు తొలగి పోతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. మహిమ గల మారుతిని సేవిస్తూ సుఖసంతోషాలను పొందుతుంటారు.