రాఘవేంద్రస్వామి లీలా విశేషం
ఓ రోజున రాఘవేంద్రస్వామి ఆశ్రమానికి ముగ్గురు జ్యోతిష్కులు వస్తారు. స్వామివారి దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు తీసుకుంటారు. ఆ సమయంలోనే వాళ్లు జ్యోతిష్యంలో తమకి గల ప్రతిభా పాటవాలను గురించి ప్రస్తావిస్తారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో తమకి గల పేరు ప్రఖ్యాతలను గురించి చెబుతారు. అవసరమైతే తమ పాండిత్యాన్ని పరీక్షించవచ్చని అంటారు.
దాంతో రాఘవేంద్రస్వామి తన జాతక చక్రాన్ని ఆ పండితులకు ఇచ్చి తన ఆయుష్షు ఎంతవరకు వుందనేది చెప్పమంటాడు. ఆ పండితులు స్వామి జాతక చక్రాన్ని వేరు వేరుగా పరిశీలిస్తారు. రాఘవేంద్రస్వామి కాలపరిమితి 76 సంవత్సరాలని ఒక జ్యోతిష్కుడు చెబుతాడు. ఆయన 300 సంవత్సరాలు వరకూ జీవించి ఉంటాడని మరో జ్యోతిష్కుడు చెబుతాడు. ఆ రెండింటినీ ఖండిస్తూ స్వామి ఆయుష్షు 700 సంవత్సరాలని మూడో జ్యోతిష్కుడు చెబుతాడు.
జ్యోతిష్య శాస్త్రంలో తిరుగులేని వారిగా చెలామణి అవుతున్న ఆ ముగ్గురు పండితులు తలోరకంగా చెప్పడంతో, రాఘవేంద్రస్వామి శిష్యులు అయోమయంలో పడిపోతారు. ఆ ముగ్గురిలో ఎవరు చెప్పినది నిజమో తెలుపవలసిందిగా స్వామిని కోరతారు. ఆ ముగ్గురి చెప్పినది నిజమేనని అంటాడు రాఘవేంద్రస్వామి. తాను జీవించి వుండేది 76 సంవత్సరాలేననీ ... తాను రాసిన గ్రంధాలు 300 సంవత్సరాల పాటు ప్రజలను ప్రభావితం చేస్తాయనీ, ఆ తరువాత వాటిని ఆదరించేవారు కరువౌతారని చెబుతాడు.
ఇక తాను సమాధిలోకి ప్రవేశించిన నాటి నుంచి 700 సంవత్సరాలు వరకూ తనని నమ్మిన భక్తులకు ప్రత్యక్షంగా వరాలను అనుగ్రహిస్తూ ఉంటాననీ, ఆ తరువాత పరోక్షంగా తన సహాయ సహకారాలు వారికి అందుతూ ఉంటాయని చెబుతాడు. స్వామివారి జాతక ఫలం మూడు విధాలుగా రావడంతో అయోమయానికి లోనైన పండితులు, ఆయన వివరణతో తేలికగా ఊపిరి పీల్చుకుంటారు.