పరీక్షకు నిలబడితేనే ఫలితం కనిపిస్తుంది
దర్శనమాత్రం చేతనే దారిద్ర్యాన్ని ... దుఃఖాన్ని దూరం చేస్తోన్న మాణిక్య ప్రభువు గురించి ఆ నోటా ఈ నోటా అంతటా ప్రచారమవుతుంది. దాంతో ఆయన అనుగ్రహాన్ని కోరుతూ వచ్చే భక్తుల సంఖ్య అంతకంతకు పెరగసాగింది. ఈ నేపథ్యంలోనే కొందరు భక్తులు మాణిక్య ప్రభువును అమితంగా ఆరాధిస్తూ ఆయన దగ్గర ప్రత్యేకమైన గుర్తింపును పొందుతారు. వాళ్లలో తన మాటపట్ల పూర్తి విశ్వాసం గల వాళ్లెవరో తెలుసుకోవాలని ప్రభువుల వారు నిర్ణయించుకుంటారు.
అనుకున్నదే తడవుగా తన భక్తుడైన ఓ తాశీల్దారును ఆయన ఎంచుకుంటారు. అదే సమయంలో ఆ తాశీల్దారు తాను వసూలు చేసిన పన్నులను హైదరాబాద్ నవాబుకు అందజేయడానికి వెళ్తున్నట్టుగా ఆయనతో చెబుతాడు. ఆ సొమ్మును తనకి ఇచ్చి వెళ్లమని ప్రభువుల వారు అడగడంతో, ఎంత మాత్రం ఆలోచించకుండా ఆ సొమ్మును అక్కడే వుంచి స్వామివారి ఆశీర్వాదం తీసుకుని వెళ్లిపోతాడు.
ఆ సొమ్మును నవాబుకు అందజేయకపోతే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందో తెలిసిన అక్కడి వాళ్లు ఆయన ధోరణికి ఆశ్చర్యపోతారు. ఈ విషయం గ్రామమంతా పాకిపోవడంతో నవాబు మనుషులు వచ్చి ఆ తాశీల్దారును తీసుకు వెళ్లడం ఖాయమని భావించి ఆయన ఇంటిదగ్గరే కూర్చుంటారు. మాణిక్య ప్రభువు వుండగా తనకి అలాంటి పరిస్థితి ఎదురుకాదని ఆ తాశీల్దారు ధైర్యంగా వుంటాడు.
ఇక పన్నులను చెల్లించే సమయానికి తాశీల్దారు పంపించారంటూ ఓ వ్యక్తి హైదరాబాద్ వచ్చి నవాబు సమక్షంలో ఆ సొమ్మును జమచేసి వెళ్లి పోతాడు. ఈ విషయం తెలిసిన తాశీల్దారు ఆశ్చర్యపోతాడు. ఆయన కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కూడా తేలికగా ఊపిరి పీల్చుకుంటారు. తాను పెట్టిన పరీక్షలో తన భక్తుడు నెగ్గాడని ప్రభువుల వారు సంతోషిస్తూ వుండగా, గురువు పట్ల తనకి గల విశ్వాసం నిజమైనందుకు ఆ భక్తుడు మురిసిపోతాడు ... మనసులోనే ప్రభువుల వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటాడు.