నదిలో కలిసే అభిషేక జలం
భగవంతుడు సర్వాంతర్యామి ... ఆయనలేని చోటు ... ఆయన మహిమలు కనిపించని చోటు ఎక్కడా వుండదు. భూమిపై ప్రతి అడుగు ... ప్రతి అణువు ఆయన పాద ధూళిచే పవిత్రమైనవే. వివిధ సందర్భాలను పురస్కరించుకుని భగవంతుడు ఆయా ప్రాంతాల్లో ఆవిర్భవించాడు. తనని విశ్వసించిన భక్తులను అనుక్షణం కనిపెట్టుకుని కాపాడుతూ వుంటాడు. అలా ఆయన కొలువైన క్షేత్రాలను భక్తజనులు దర్శిస్తూ ... తరిస్తూ వుంటారు.
ఈ నేపథ్యంలో ఒక్కో క్షేత్రంలో ఒక్కో ప్రత్యేకత ... ఒక్కో విశిష్టత మహిమాన్వితమై దర్శనమిస్తూ వుంటాయి. సాధారణంగా స్వామివారిని అభిషేకించిన జలం గర్భగుడి నుంచి ఏర్పాటు చేయబడిన రంధ్రం గుండా బయటికి వచ్చేస్తుంటుంది. మరికొన్ని క్షేత్రాల్లో అభిషేక జలం గర్భాలయంలో ఇంకిపోయి ఆశ్చర్యచకితులనుచేస్తూ వుంటుంది.
ఇందుకు పూర్తి భిన్నంగా అభిషేక జలం గర్భాలయం నుంచి నేరుగా నదిలో కలిసే తీరు మనకి అనంతపురం జిల్లా 'పెన్నా అహోబిలం' క్షేత్రంలో కనిపిస్తుంది. ప్రాచీనకాలానికి చెందిన ఈ క్షేత్రంలో లక్ష్మీనరసింహస్వామి దర్శనమిస్తూ ఉంటాడు. ఇక్కడ స్వామివారి గర్భాలయం కింది భాగంలో బిలం వుందని చెబుతారు. స్వామివారికి అభిషేకించిన జలం ఈ బిలం ద్వారా పెన్నా నదిలో కలుస్తుందని అంటారు.
స్వామివారి గర్భాలయం చూడటానికి మామూలుగానే వుంటుంది. దానికింద బిలం వుందని చెబుతారు గాని అది ఎవరికీ కనిపించదు. ఎన్ని బిందెలతో స్వామివారిని అభిషేకించినా ఒక్క చుక్క నీరు కూడా బయటికి రాదు. అభిషేక జలం పెన్నా నదిలో కలుస్తుంది గనుకనే ఈ క్షేత్రానికి 'పెన్నా అహోబిలం' అనే పేరు వచ్చిందని అంటారు. ఇక్కడ చోటుచేసుకునే మహిమాన్వితమైన ఈ దృశ్యాన్ని వీక్షించడానికి భక్తులు ఎక్కువగా వస్తుంటారు. ఆ స్వామి లీలా విశేషాలను కొనియాడుతూ తరిస్తుంటారు.