శ్రీరాముడు ఆగ్రహించిన వేళ
చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతతకు ప్రతి రూపంలా కనిపించే శ్రీరామచంద్రుడు, ఆగ్రహించిన సందర్భాలు చాలా తక్కువ. తన భక్తులకు ఇతరు కారణంగా కష్టం కలిగినప్పుడు మాత్రమే ఆయన ఆగ్రహించిన సందర్భాలు కనిపిస్తాయి. పోతన విషయంలో సింగభూపాలుడు తన హద్దులు దాటినప్పుడు శ్రీరాముడు ఆగ్రహించిన సందర్భం కనిపిస్తుంది.
తనకి పోతన భాగవతం అంకితం ఇవ్వడానికి అంగీకరించలేదనే కోపంతో, ఆయన కుటుంబానికి సింగభూపాలుడు రాజ్య బహిష్కరణ శిక్షను విధిస్తాడు. పోతన ఇంటిని స్వాధీనం చేసుకుని ఆ ఇంట్లోని భాగవత గ్రంధాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తాడు. అనూహ్యమైన విధంగా ఆటంకాలు ఏర్పడుతూ ఉండటంతో, సహనం కోల్పోయిన సింగభూపాలుడు పోతన ఇంటిని కూల్చేయమని సైన్యాధిపతిని ఆదేశిస్తాడు.
అందుకు సైనికులు సిద్ధపడుతూ వుండగా, ఆకాశం మేఘావృతమవుతుంది. హఠాత్తుగా ఉరుములు ... మెరుపులతో కూడిన గాలి మొదలవుతుంది. ప్రకృతి వైపరీత్యం సంభవించబోతున్నట్టు అనిపించడంతో, తన ఇష్ట దైవానికి సింగభూపాలుడు నమస్కరించుకుంటాడు. పోతన పట్ల ఆయన ప్రవర్తన శ్రీరామచంద్రుడికి ఆగ్రహాన్ని కలిగించిందనీ, వెంటనే పోతనకి క్షమాపణ చెప్పి ఆయనని సగౌరవంగా రాజ్యానికి ఆహ్వానించమని అశరీరవాణి పలుకుతుంది. లేదంటే ప్రళయం ఆ రాజ్యాన్ని అతలా కుతలం చేస్తుందని హెచ్చరిస్తుంది.
దాంతో వెంటనే తన పరివారంతో బయలుదేరిన సింగభూపాలుడు, పోతన కుటుంబ సభ్యుల జాడ తెలుసుకుని క్షమాపణ కోరతాడు. దగ్గర వుండి వాళ్లని మర్యాద పూర్వకంగా రాజ్యానికి తీసుకువస్తాడు. సింగభోపాలుడి సమక్షంలోనే పోతన తాను రచించిన భాగవత గ్రంధాన్ని శ్రీరామచంద్రుడికి అంకితం చేస్తాడు.