కోటి వరాల నిచ్చే కోటమైసమ్మ
ఏ దిక్కూ లేనివారికి దేవుడే దిక్కు అనే మాట తరచూ వింటూవుంటాం. ఎవరి సహాయ సహకారాలు అందుబాటులో లేని సమయంలో, రాయినో ... చెక్కముక్కనో దైవంగా భావించి ఆరాధిస్తూ ఉండటమనేది ప్రాచీనకాలం నుంచి వుంది. బలమైన విశ్వాసాన్ని కలిగి అంకితభావంతో ఆరాధిస్తే, రాయి సైతం దైవమై రక్షిస్తుంది ... రత్నాల వానను కురిపిస్తుంది.
అలా ఎవరూలేని ఓ నిర్జన ప్రదేశంలో, తనని తాను రక్షించుకోవడం కోసం ఓ పశువులకాపరి ఓ రాయిని నమ్ముకున్నాడు. ఆ రాయిని తనకి ఇష్టమైన 'కోట మైసమ్మ' గా భావించి పూజించాడు. అతని విశ్వాసానికి వెన్నలా కరిగిపోయిన అమ్మవారు, ఆ పశువుల కాపరితో పాటు పశువులను కూడా కాపాడుతూ వస్తుంటుంది. ఈ నేపథ్యంలో జరుగుతోన్న మహిమల గురించి ఆ నోటా ఈ నోటా ఆ ఊరి జమీందారుకి తెలుస్తుంది.
అయితే ఆ ప్రచారంలో నిజం లేదంటూ ఆయన కొట్టిపారేస్తాడు. ఫలితంగా ఆయనకి అనుకోకుండా ఓ ఆపద ఎదురవుతుంది. అమ్మవారి దయవలన ఆ గండం నుంచి బయటపడిన ఆయన ఆమె భక్తుడిగా మారిపోతాడు. అక్కడే ఆమ్మవారికి ఆలయాన్ని నిర్మించి ఆ ప్రతిమను అందులో ప్రతిష్ఠించాడు. ఆ రోజు నుంచి అశేష భక్త జనులతో పూజలు అందుకుంటోన్న కోటమైసమ్మ అమ్మవారు ఖమ్మం జిల్లా 'ఉసిరికాయల పల్లి' లో దర్శనమిస్తుంది.
కొలిచిన వెంటనే కోటి వరాలను అందించే చల్లని తల్లిగా ఇక్కడి భక్తులు అమ్మవారిని ఆరాధిస్తూ వుంటారు. ప్రతియేటా దసరా నవరాత్రుల సందర్భంగా అయిదు రోజులపాటు జాతర జరుపుతారు. ఘనంగా జరిగే ఈ ఉత్సవంలో భక్తులు వేలాదిగా పాల్గొని మొక్కుబడులు చెల్లిస్తూ వుంటారు. అమ్మవారు పశువులను కూడా సంరక్షిస్తూ వుంటుంది గనుక, ఆ పశువులతో పాటుగా ... అంటే ఎడ్లబండ్లతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం ఇక్కడి ఆచారంగా వస్తోంది.