గీతాపారాయణ ఫలితం
కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడిని కార్యోన్ముఖుడిని చేయడానికి ... ధర్మరక్షణ గావించడానికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేశాడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ప్రబోధం, వేదవ్యాస విరచితమై 'భగవద్గీత' గా ప్రసిద్ధి చెందింది. అలాంటి భగవద్గీత ... విశ్వకళ్యాణ గీతగా ఆధ్యాత్మిక ప్రపంచాన అలరారుతోంది. భగవద్గీతలో కనిపించనిది ... వినిపించనిది మరెక్కడా ఉండదని ఆధ్యాత్మిక చింతనలో తరించే అశేష భక్త జనులు విశ్వసిస్తుంటారు. సాక్షాత్తు పరమాత్ముడి వాక్కుకు ... ఆయన తత్త్వానికి అక్షర రూపమైన భగవద్గీత ... ప్రతి ఇంట్లోను ఉండవలసిన పరమ పవిత్రమైన గ్రంధం.
18 రోజులపాటు జరిగిన కురుక్షేత్ర యుద్ధం 'మహాభారతం' లో 18 మహా పర్వాలుగా దర్శనమిస్తుంది. అలాగే భగవద్గీతలోను అర్జున విషాదయోగం .. సాంఖ్యాయోగం .. కర్మయోగం .. జ్ఞానయోగం .. కర్మసన్యాస యోగం .. ఆత్మసంయమ యోగం .. విజ్ఞానయోగం .. అక్షర పరబ్రహ్మ యోగం .. రాజ్యవిద్యా రాజగుహ్య యోగం .. విభూతియోగం .. విశ్వరూప సందర్శన యోగం .. భక్తి యోగం .. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం .. గుణత్రయ విభాగయోగం .. పురుషోత్తమప్రాప్తి యోగం .. దైవాసుర సంపద్విభాగ యోగం .. శ్రద్ధాత్రయ విభాగయోగం .. మోక్షసన్యాస యోగం .. అనే 18 అధ్యాయాలు కనిపిస్తాయి.
ఈ అష్టాదశ అధ్యాయాలను పారాయణం చేయడం వలన అనారోగ్యాలు ... అపమృత్యు భయాలు తొలగిపోతాయి. అజ్ఞానం నశించి ఆత్మజ్ఞానం మేల్కొల్ప బడుతుంది. దారిద్ర్యం .. దుఃఖం .. నివారించబడి సుఖసంతోషాలు కలుగుతాయి. దెబ్బతీయాలనుకున్న శత్రువులు నశించి ఆశించిన విజయాలు ప్రాప్తిస్తాయి. భగవద్గీతను చదవడం వలన .. వినడం వలన పునర్జన్మ ఉండదని చెప్పబడుతోంది. మొత్తంగా పారాయణం చేయడం వల్లనే కాకుండా, ఒక్కో అధ్యాయాన్ని చదవడం వలన ఒక్కో ఫలితం లభించడం భగవద్గీత పారాయణంలోని మరో విశేషంగా చెప్పుకోవచ్చు.