పుట్టుమచ్చలు (చెక్కిళ్లు - మెడ)
'కుడిచెంప'పై పుట్టుమచ్చ ... సున్నితమైన మనస్తత్వాన్ని సూచిస్తుందని చెప్పవచ్చు. వీరి మాటలు ... చేతలు ఎదుటి వారికి కష్టం కలిగించకుండా సున్నితంగా వుంటాయి. అందువలన అందరూ వీరిని ఎంతగానో ఇష్టపడుతుంటారు. ఎదుటివారు బాధల్లో వుంటే ఏ మాత్రం తట్టుకోలేని వీరు, దానధర్మాలు కూడా అధికంగానే చేస్తుంటారు. పుట్టుకతోనే శ్రీమంతులైన వీరి జీవితం చివరి వరకూ సాఫీగా సాగిపోతుంది.
'ఎడమచెంప'పై పుట్టుమచ్చ వుంటే ... ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఆందోళన చెందుతూ వుంటారు. ప్రతి విషయాన్ని భూతద్దంలో నుంచి చూస్తూ, నానా హడావిడి పడిపోతుంటారు. భార్యతో సహా బంధువులందరినీ ద్వేషిస్తూ సాధ్యమైనంత వరకూ ఒంటరిగా ఉండటానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంటారు.
ఇక 'మెడ'పై పుట్టుమచ్చ వున్న వారి మనసు కఠినంగా వుంటుంది. వీరు దయా దాక్షణ్యాలు లేకుండా వ్యవహరిస్తుంటారు. ప్రతి చిన్న విషయానికి ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తూ ఎదుటి వారిపై తిరగబడుతుంటారు. ఇతరులు వీరిని పలకరించడానికే భయపడేలా ప్రవర్తిస్తుంటారు. 'గొంతు కింద' పుట్టుమచ్చ వున్న వారు ... అదృష్టవంతుల కిందికే వస్తారు. వీరు అందంగా కనిపించడమే కాకుండా, అందరితోను గౌరవ మర్యాదలను అందుకుంటారు. ఇక అన్నీ అమర్చి పెట్టినట్టుగా వీరి జీవితం సుఖ శాంతులతో కొనసాగుతుంది.
ఇక 'కంఠం మొదట్లో' పుట్టుమచ్చ వున్న వారు ... అందంతో పాటు అతిశయాన్ని కలిగి వుంటారు. వ్యవహారంలో కూర్చున్నప్పుడు అవతలి వారు నొచ్చుకునేలా మాట్లాడుతుంటారు. సమయం దొరికినప్పుడల్లా తమని తాము గొప్పగా చెప్పు కుంటూ ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడుతుంటారు. ఈ కారణంగానే వీరు ఇబ్బందుల్లో కూడా పడుతుంటారు.
ఇక 'కంఠం పై' పుట్టుమచ్చ ధనవంతుడిని సైతం దరిద్రుడిని చేస్తుంది. మధ్యలో కాకుండా కంఠం ఏ వైపున పుట్టుమచ్చ ఉన్నా దాయాదుల కారణంగా ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. కంఠంపై పుట్టుమచ్చ స్త్రీలకు కూడా చెడు ఫలితాలనే ఇస్తుంది. ఈ పుట్టుమచ్చ కారణంగా స్త్రీలు ఆర్ధికపరమైన ఇబ్బందులతో సతమతమైపోయే అవకాశాలు వున్నాయి.