రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో అత్యంత విలువైన ప్రాంతమైన ఆత్మగౌరవ భవనాలను ఈ నెల 17 న రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభిస్తున్నారు

Related image

ప్రచురణార్ధం. హైదరాబాద్:15 సెప్టెంబర్,2022.
----------------------------------------------

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో అత్యంత విలువైన ప్రాంతమైన బంజారా హిల్స్ రోడ్ నందు విడివిడిగా నిర్మించిన కుమ్రం భీమ్ ఆదివాసీ, సేవాలాల్బం జారా ఆత్మగౌరవ భవనాల్లో అత్యాధునిక వసతులను ప్రభుత్వం కల్పించినది. ఈ ఆత్మగౌరవ భవనాలను ఈ నెల 17 న రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రా వు ప్రారంభిస్తున్నారు.

ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్ కు దీటుగా ఏదయినా వేడుకలు,సదస్సులు, సమావేశాలు జరుపు కునేందుకు అనువుగా ప్రతి ఆత్మగౌరవ భవనము నందు ఒక వేయి సీట్ల సామర్ధ్యం కలిగిన ఆడిటోరియం లను నిర్మించడం జరిగింది. మీడియా తో పాటు ఆదివాసీ, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం, కళలు ,వేడుకలను తెలియజేసే లైబ్రరీ, ఆర్ట్ ఫాక్ట్ & పెయింటింగ్ ల ప్రదర్శనకు ప్రతి భవనంలో 4 సువిశాల గ్యాలరీ లను ఏర్పాటు చేశారు. ప్రతి భవనంలో 3 వి. ఐ. పి. లాంజ్ లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అలాగే 250 మంది ఒకేసారి భోజనం చేసే విధంగా డైనింగ్ హాల్స్ ను నిర్మించారు. కుమ్రం భీమ్ ఆదివాసీ భవనము ఆవరణలో 80 వాహనాలు పార్కింగ్ సదుపాయం వుంది. సేవాలాల్ బంజారా భవనము ఆవరణలో 35 వాహనాలు పార్కింగ్ కు అవకాశం వుంది కుమ్రం భీమ్ ఆదివాసీ ఆత్మగౌరవ భవనము నందు సెల్లార్ 3 అంతస్తులు ఉన్నాయి. సేవాలాల్ బంజారా భవన్ లో 3 అంతస్తులు ఉన్నాయి.( ఫోటోలతో పాటు సదుపాయాలు వివరాలు జతపర్చనైనది).

 --------------------------------------------------------------------------------------------------------------------------శ్రీయుత కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్ వారిచే జారీ చేయనైనది.

More Press Releases