తల్లీ బిడ్డ ఆరోగ్య సంరక్షణకు కె. సి.ఆర్.కిట్ పధకాన్ని అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం

Related image

ప్రచురణార్ధం. హైదరాబాద్:10సెప్టెంబర్,2022.

*తల్లీ బిడ్డ ఆరోగ్య సంరక్షణకు కె. సి.ఆర్.కిట్ పధకాన్ని అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం

కె. సి. ఆర్. కిట్ తో ఇప్పటివరకు 13,29,951 మంది లబ్ధిపొందారు.

*ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో భాగంగా మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. భవిష్యత్ తరాలు ఆరోగ్యవంతులుగా ఎదిగేందుకు ఆటంకంగా ఉన్న పోషకాహార,ఇమ్మ్యూనైజేషన్ లోపాలను అధిగమించుటకు కె. సి. ఆర్. కిట్ పధకాన్ని ప్రభుత్వం పటిష్టంగా అమలుచేస్తున్నది. మహిళల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న అనవసర సిజెరియన్ ప్రసవాలను అరికట్టుటకు ప్రభుత్వ ఆసుపత్రులలో జరిగే ప్రసవాల సంఖ్యను గణనీయంగా పెంచడమే ప్రభుత్వ లక్ష్యం. మాతా శిశు మరణాలను తగ్గించుట కూడా ప్రభుత్వ సంకల్పం. ఇటువంటి ఉన్నత లక్ష్యాల సాధనకు వినూత్న వరవడితో దేశంలో ఎక్కడా లేని విధంగా అమలు చేస్తున్న కె. సి. ఆర్. కిట్ పధకంతో ఆరోగ్య సూచికల్లో తెలంగాణ రాష్ట్రమునకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇద్దరు పిల్లల వరకు కె. సి. ఆర్. కిట్ కింద ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టిన మగ శిశువుకు రూ.12,000/-, ఆడశిశువు పుడితే రూ 13,000/- లను ఆర్ధిక సహాయంగా నాలుగు విడతలలో ప్రభుత్వం అందిస్తున్నది. మహిళ గర్భం దాల్చినప్పటినుంచి ప్రసావానంతనరం కూడా తల్లీ బిడ్డ కు అవసరం అయిన అన్ని రకాల వైద్య పరీక్షలు,ఇమ్మ్యూనైజెషన్ వాక్సినేషన్లను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్నది. 

    కేసీఆర్ కిట్ పధకాన్ని 2017 జూన్ 2 న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలను పెంచుట, ప్రసూతి మరణాలు, శిశు మరణాలను తగ్గించడమే కేసీఆర్‌కిట్ప్ర ధాన లక్ష్యం. గర్భిణీకి అవాంతరాలు లేని ప్రభుత్వ వైద్య సంరక్షణను ప్రసవానంతరం కూడా అందించుటకు ఆయా ప్రాంతాల వైద్యులు, సిబ్బంది రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తున్నారు. ఈ పథకం ఇద్దరు జీవించి ఉన్న పిల్లలకు మాత్రమే పరిమితం చేయబడింది. అయితే 2018 ఆగస్టు 2 నుండి ప్రత్యేక ఆదివాసీ గిరిజన తెగల సంరక్షణ, మనుగడకు కె. సి. ఆర్. కిట్ నిబంధనలుకు ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇచ్చింది తద్వారా అమలులోకి వచ్చిన నిబంధనలు ప్రకారం కేసీఆర్ KIT ప్రయోజనాలను 2వ సంతానానికి మించిన చెంచు, కోలం, కొండారెడ్డిలు వంటి ప్రత్యేకించి ఆదివాసీ గిరిజన సమూహాలకు (PVTGలు) కు వర్తింపచేస్తున్నారు.ఈ పధకం కింద రిజిస్టర్ అయిన గర్భిణీకి అవసరం అయిన టీకాలను, విటమిన్లను ప్రభుత్వ వైద్య సిబ్బంది ఉచితంగా అందిస్తున్నారు. కె. సి. ఆర్ కిట్ కింద 2017 నుండి ఇప్పటి వరకు 13,29,951 మంది లబ్ధిపొందారు. కె. సి. ఆర్. కిట్ పధకం అమలుకు ప్రభుత్వం రూ. 1176 కోట్ల 54 లక్షలను ప్రభుత్వం ఖర్చు చేసింది. 

   అలాగే రూ.243 కోట్ల 68 లక్షలను ఖర్చు చేసి 11,82,014 కేసీఆర్ కిట్‌లను ప్రభుత్వం పంపిణీ చేసింది.ప్రతి కిట్ లో శిశువు ఆరోగ్య సంరక్షణకు అవసరం అయిన 15 రకాల వస్తువులను ప్రభుత్వం అందజేస్తున్నది.

శ్రీయుత కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్ వారిచే జారిచేయనైనది

More Press Releases