VVPat vote Verification: ‘వీవీప్యాట్‌లతో 100 శాతం ఓట్ల ధ్రువీకరణ’ కేసులో నేడే సుప్రీం తీర్పు

SC to announce verdict on 100 percent vote verification through vvpats

  • వీవీప్యాట్‌‌లతో పూర్తిస్థాయిలో ఈవీఎం ఓట్లను ధ్రువీకరించాలంటూ పిటిషన్
  • 100 శాతం ఓట్లను ధ్రువీకరించాలన్న పిటిషనర్ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్
  • ఈ ఉదయం 10.30 గంటలకు తీర్పు  

ఈవీఎంలల్లో నమోదయ్యే ఓట్ల సంఖ్యను వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుతో 100 శాతం సరిపోల్చాలంటూ దాఖలైన కేసులో శుక్రవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉదయం 10.30 గంటలకు తీర్పు వెలువరిస్తుంది. ఈసీ ప్రతివాదిగా ఉన్న ఈ కేసును అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సహా పలువురు దాఖలు చేశారు. 

బుధవారం సుప్రీంలో కేసు విచారణ సందర్భంగా ఈవీఎంలు, వీవీప్యాట్‌లకు సంబంధించి న్యాయమూర్తులు అడిగిన పలు ప్రశ్నలకు ఈసీ నిపుణులు స్వయంగా సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా సుప్రీం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలను నియంత్రించడం తమ పని కాదని స్పష్టం చేసింది. రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్‌కు తాము మార్గదర్శకాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

VVPat vote Verification
Supreme Court
Election Commission
Vote Counting
Lok Sabha Polls
  • Loading...

More Telugu News