పారిశుధ్య నిర్వహణ మరియు డ్రెయిన్లలో మురుగునీటి పారుదల విధానం పరిశీలన: వీఎంసీ కమిషనర్

Related image

  • అధికారులకు ఆదేశాలు: కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజ‌య‌వాడ‌ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం 18వ డివిజన్ పరిధిలోని కృష్ణలంక, రాణిగారి తోట ప్రాంతములోని పలు వీధులలో పారిశుధ్యo మరియు అండర్ గ్రౌండ్ డ్రెయినేజి నిర్వహణ విధానమును పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. డివిజన్ పరిధిలో పారిశుధ్య కార్మికుల మస్తరు విధానము పరిశీలించారు. రాణిగారి తోట ప్రాంతములోని పలు వీధులలో స్థానికులను మంచినీటి సరఫరా విధానము, ప్రతి రోజు చెత్త సేకరణకు మరియు డ్రెయిన్స్ శుభ్రపరచుటకు సిబ్బంది వస్తున్నది లేనిది అడిగితెలుసుకొని ఎవరు చెత్తను వీధులలో లేదా డ్రెయిన్ లలో పడవేయకుండా చెత్త సేకరణకు వచ్చు పారిశుధ్య సిబ్బందికి అందించి పరిసరాలు అన్నియు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

అదే విధంగా డివిజన్లో ఇంటింటి చెత్త సేకరణ విధానము మరియు డ్రెయిన్ నందు మురుగునీటి పారుదల తీరును పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు ఇస్తూ, డ్రెయిన్ లలో నీటి పారుదలకు అడ్డంగా ఉన్న చెత్త మరియు వ్యర్ధములను తొలగించాలని, నూరు శాతం డోర్ టు డోర్ బాస్కెట్ కలెక్షన్ జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు.

అదే విధంగా అండర్ గ్రౌండ్ డ్రెయినేజికి సంబందించి యంత్రముల ద్వారా మ్యాన్ హోల్స్ శుభ్రపరచు విధానము స్వయంగా పరిశీలిస్తూ, యు.జీ.డి నందలి మురుగునీటి పారుదలలో ఎటువంటి ఇబ్బంది కలుగకుండా మ్యాన్ హోల్స్ పొంగిపొర్లకుండా ఎప్పటికప్పుడు మ్యాన్ హోల్స్ నందలి సిల్ట్ తొలగించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

పర్యటనలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.పి.రత్నావళి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.చంద్ర శేఖర్, హెల్త్ ఆఫీసర్ డా.ఇక్బాల్ హుస్సేన్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.ఆంధ్ర కేసరి టంగుటూరి ప్ర‌కాశం పంతులు జయంతిని పురష్కరించుకొని నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులు మరియు సిబ్బందితో కలసి నివాళ్ళు అర్పించిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జ‌యంతిని పురస్కరించుకొని నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రకాశం పంతులు చిత్ర పట్టానికి మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పూలమాల వేసిన నివాళుల‌ర్పించారు.

ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్ర‌కేస‌రి ప్రకాశం పంతులు ఆశ‌య సాధ‌నకు కృషి చేయ‌డ‌మే వారికి అర్పించే నిజ‌మైన నివాళి అన్నారు. దేశ‌భ‌క్తి, త్యాగ‌నిర‌తిని యువ‌త ఆద‌ర్శంగా తీసుకోవాల‌న్నారు. క్విట్ ఇండియా, సైమన్ కమిషన్ గో బ్యాక్, ఉప్పు సత్యాగ్రహం వంటి పోరాటాలలో ముందుండి నడిపించిన నాయకులు ఆంధ్రకేసరి, తెల్లవాడి తుపాకీ తూటాలకు భయపడని ధీశాలి అన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎనలేని సేవ చేవలందించారన్నారు.

కార్య‌క్ర‌మంలో న‌గ‌ర పాల‌క సంస్థ అదనపు కమిషనర్(జనరల్) యం.శ్యామల, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.పి.రత్నావళి, ఎస్.ఇ పి.వి.కె భాస్కర్, ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు.

More Press Releases