వీధి కుక్కలను నియంత్రించే దిశగా చర్యలు: వీఎంసీ కమిషనర్

Related image

విజ‌య‌వాడ‌: సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ నందలి డాగ్ ఆపరేషన్ యూనిట్ నందు ఏర్పాటు చేసిన వీధి కుక్కలకు ఆపరేషన్ ప్రక్రయను నగరపాలక సంస్థ కమిషనర్ పి.రంజిత్ భాషా 59వ డివిజన్ కార్పొరేటర్ మొహమ్మద్ షహీనా సుల్తానా మరియు అధికారులతో కలసి ప్రారంభించారు.

ఈ సందర్భంలో కమిషనర్ రంజిత్ భాషా మాట్లాడుతూ వీధి కుక్కలా నియంత్రణకు, పక్క ప్రణాళికతో మరియు నగరంలో అన్ని వీధి కుక్కలకు ఒక సంవత్సరకాలంలో పూర్తి చేయ్యాలని నిర్దేశించడమైనది. మరియు నగరంలో చుట్టు ప్రక్కల అన్ని గ్రామాలలో కుడా ఒకేసారి ఆపరేషన్లు చేసిన యెడల వీధికుక్కలను అధిక సంఖ్యలో సంతానోత్పత్తి లేకుండా చేయుటకు వీలు అవుతుందని అన్నారు. నగరంలో గల వీధి కుక్కలకు మరియు పెంపుడు కుక్కలకు ఆపరేషన్ నిర్వహించుటతో పాటుగా వాటికీ యాంటి రైబైస్ వ్యాక్షిన్ కూడా ఇవ్వటం జరుగుతుందని తెలియజేశారు.

నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న కుక్కల ప్రేమికులు, యజమానులు మరియు బ్లూ క్రాస్ సంస్థ ప్రతినిధులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొవాలని సూచించారు. వీదులలో సంచరించు కుక్కలను తమ సిబ్బంది పట్టుకొని వాటికీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ నిర్వహించి డాగ్ ఆపరేషన్ యూనిట్ నందు మూడు రోజుల పాటుగా డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచి తదుపరి వాటిని ఎక్కడ నుండి తీసుకువచ్చేమో అదే ప్రదేశంలో మరలా వదిలివేయుట జరుగుతుందని అన్నారు. స్థానిక ప్రజలు మరియు కుక్కల ప్రేమికులు నగరపాలక సంస్థ వారితో సహకరించాలని మరియు నివాసాలలో పెంపుడు కుక్కల యజమానులు కూడా స్వచ్చందంగా ముందుకు వచ్చి మీ కుక్కలకు ఆపరేషన్ మరియు యాంటి రైబైస్ వ్యాక్షిన్ చేయించుకోవాలని సూచించారు.

కార్యక్రమములో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతాభాయి, వెటర్నరి అసిస్టెంట్ సర్జిన్ డా.రవిచంద్, హెల్త్ ఆఫీసర్ డా.రామకోటీశ్వరరావు ఇతర డాక్టర్లు మరియు బ్లూ క్రాస్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

More Press Releases