పారిశుధ్య కార్మికుల కుటుంబ సభ్యులకు ఓదార్పునిచ్చిన విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి

Related image

విజ‌య‌వాడ‌: ప్రభుత్వ హాస్పటల్ లో చికిత్స పొందుతున్న పారిశుధ్య కార్మికుల యొక్క ఆరోగ్య పరిస్థితులను నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్వయంగా వైద్యులను వివరాలు అడిగి తెలుసుకొన్నారు. విధులలో ఉన్న సమయంలో దురదృష్టవశాత్తూ జరిగిన రోడ్ ప్రమాదములో గాయాలు అయిన పారిశుధ్య కార్మికులకు మనోధైర్యాన్ని ఇస్తూ, చికిత్స పొందుతున్న కార్మికులను పలకరించి, కుటుంబ సభ్యులను ఓదార్పునిస్తూ, కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించునట్లుగా చూడాలని హాస్పిటల్ వైద్య అధికారులను కోరారు. ఈ సందర్భంలో ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోనే విధంగా కార్యాచరణ రూపొందించాలని ప్రజారోగ్య అధికారులకు సూచించారు.

కార్యక్రమములో స్థానిక 3వ డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక, హెల్త్ ఆఫీసర్ డా.శ్రీదేవి, ప్రభుత్వ హాస్పటల్ వైద్యులు, శానిటరీ సూపర్ వైజర్ ఓబెశ్వరరావు మరియు పారిశుధ్య కార్మికుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

పురసేవా కేంద్రములో విధులు నిర్వహించు సిబ్బంది భాద్యతగా వ్యవహరించాలి: కమిషనర్ పి.రంజిత్ భాషా
నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల పుర సేవా కేంద్రం (103 సెల్) ను కమిషనర్ పి.రంజిత్ భాషా పరిశీలించి విధులలో ఉన్న సిబ్బందిని ప్రజల నుండి వచ్చిన సేవా వినతుల గురించి వాటి పరిష్కారమునకు తీసుకొనే చర్యల గురించి ప్రశ్నించారు. ఈ సందర్భంలో పౌర సేవా కేంద్రం నందలి జననమరణ దృవీకరణ కౌంటర్ నందు సిబ్బందిని జననమరణ సమాచారము నిర్ణీత గడువులోపల హాస్పిటల్ నుండి వచ్చుచున్నాదా? లేదా? ఏమైనా సమస్యలు కలవా అని వాకబు చేశారు.

ధృవీకరణ పత్రముల కొరకు వచ్చు ప్రజలకు పూర్తి సమాచారము అందచేయవలెనని, విధి నిర్వహణ పట్ల బాధ్యతగా ఉండవలెను అని ప్రతి సేవకు సంబంధించిన పూర్తి సమాచారము పరిష్కారము మరియు జారీ కొరకు నిర్దేశించిన గడువు వివరములు తదితర విషయములపై పూర్తి అవహగాన కలిగి ఉండవలెనని, ఆలస్య నమోదునకు సంబంధించి అమలులో ఉన్న ప్రభుత్వ నిబంధనల కాపీలను అందుబాటులో ఉంచుకొనవలెనని సిబ్బందిని ఆదేశించారు. అదే విధంగా పుర సేవా కేంద్రములలో గల ఇతర కౌంటర్ల పనితీరును అడిగితెలుసుకోని సిబ్బంది సేవా దృక్పదంతో ప్రజలకు సేవ చేసేలా పని చేయాలని అన్నారు.

More Press Releases