KTR: తెలంగాణ మళ్లీ టీఆర్ఎస్ దే: కేటీఆర్

  • కేసీఆర్ పాలనలో తెలంగాణ దూసుకుపోతోందన్న కేటీఆర్
  • ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని వ్యాఖ్య
  • దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్న మంత్రి
TRS will win in coming elections says KTR

తెలంగాణలో మళ్లీ వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. వరుసగా మూడోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలను చేపడతారని అన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి గత ఎనిమిదేళ్లుగా కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకుపోతోందని చెప్పారు. సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందుతున్నాయని తెలిపారు. కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి తదితర పథకాలతో లక్షల మందికి ప్రభుత్వం అండగా ఉందని చెప్పారు. 

రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో యావత్ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని కేటీఆర్ అన్నారు. వ్యవసాయం, ఐటీ, పర్యావరణం, పరిశ్రమలు, పట్టణాభివృద్ది తదితర అంశాలతో సమతుల్యమైన కొత్త ఇంటెగ్రేటెడ్ హోలిస్టిక్ మోడల్ ను దేశం ముందు ఉంచామని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కొందరు చేస్తున్న కుట్రలు ఫలించవని చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలకు పాల్పడినా టీఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేరని అన్నారు. మరోవైపు, జగిత్యాలలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగసభను నిర్వహిస్తోంది. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

More Telugu News