Focus Movie: హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా `ఫోకస్` ట్రైలర్ విడుదల

  • విజయ్ శంకర్, అషూరెడ్డి జంటగా 'ఫోకస్'
  • పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న అషూరెడ్డి
  • ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'ఫోకస్'
Hero Srikanth launched Focus movie trailer

యంగ్ హీరో విజ‌య్ శంక‌ర్, `బిగ్‌బాస్` ఫేమ్‌ అషూరెడ్డి హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం `ఫోక‌స్`. మర్డర్‌ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఆద్యంతం ఉత్కంఠ‌మైన క‌థ క‌థ‌నాల‌తో న్యూ ఏజ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కింది. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవ‌ల విడుద‌లైన మూవీ టీజ‌ర్ ఐదు ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ సాధించి సోష‌ల్ మీడియాలో విశేష ఆద‌ర‌ణ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో అషురెడ్డి మొద‌టిసారిగా పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నుంది. 

సుహాసిని మ‌ణిర‌త్నం, భానుచంద‌ర్, జీవా, షియాజీ షిండే, భరత్‌ రెడ్డి, రఘు బాబు, సూర్య భగవాన్‌ తదితరులు కీల‌క పాత్ర‌ల‌లో న‌టించిన ఈ చిత్రానికి జి. సూర్య‌తేజ ద‌ర్శ‌కుడు, వీర‌భ‌ద్ర‌రావు ప‌రిస‌ నిర్మాత‌. అక్టోబ‌రు 28న ఈ మూవీ థియేట‌ర్స్‌లో గ్రాండ్‌గా విడుద‌ల‌కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. 

ఈ సంద‌ర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ... `ఫోకస్` మూవీ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పారు. ద‌ర్శ‌కుడు సూర్య‌తేజ మంచి సబ్జెక్ట్‌ను ఎంచుకున్నారని, హీరో విజ‌య్ శంక‌ర్ చాలా బాగా చేశాడని కితాబిచ్చారు. ఈ నెల 28న థియేట‌ర్లలో విడుదలవుతున్న ఆ సినిమాను చూసి ఎంజాయ్ చేయాలని చెప్పారు. ఈ సినిమాతో నిర్మాతగా ప‌రిచ‌య‌మ‌వుతున్న‌ వీరభ‌ద్ర‌రావు గారికి, మిగతా టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్ అని అన్నారు.

హీరో విజయ్ శంకర్ మాట్లాడుతూ... ఈ సినిమా తన కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీ అని చెప్పాడు. ఇది కంప్లీట్ క్రైమ్ థ్రిల్లర్ అని... ఈ జోనర్ ని ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లా ఉంటుందని అన్నాడు. చిత్ర ద‌ర్శ‌కుడు జి. సూర్య‌తేజ మాట్లాడుతూ... 'ఫోక‌స్' అనేది ఒక కొత్త త‌ర‌హా క్రైమ్ థిల్ల‌ర్ అని... తెలుగు ఆడియ‌న్స్ ఈ జోన‌ర్‌ను ఎక్కువ‌గా ఎంక‌రేజ్ చేస్తారని చెప్పారు. ఊహించ‌ని మ‌లుపుల‌తో స‌రికొత్త క‌థ‌, క‌థ‌నాల‌తో ఈ సినిమా రూపొందిందని అన్నారు.

More Telugu News