T20 World Cup: పాక్ ​తో వరల్డ్​ కప్​ మ్యాచ్​.. టాస్​ నెగ్గి బౌలింగ్​ ఎంచుకున్న భారత్​​

  • గత అనుభవాల దృష్ట్యా ఛేజింగ్ కు మొగ్గు చూపిన రోహిత్ శర్మ
  • తుది జట్టులో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు
  • కీపర్ గా పంత్ కు బదులు దినేశ్ కార్తీక్ కు మొగ్గు
Rohit wins toss India will bowl first t20 world cup match against Pak

టీ20 ప్రపంచ కప్ లో యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కు ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ క్రికెట్ మైదానం వేదికైంది. లక్ష మంది ప్రేక్షకుల కేరింతల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ ఆరంభంలో భారత్ ను అదృష్టం వరించింది. ఈ సూపర్ 12 పోరులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ నెగ్గాడు. గత అనుభవాల దృష్ట్యా ఈసారి బ్యాటింగ్ కాకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. గత టీ20 ప్రపంచ కప్ తొలి మ్యాచ్ లో భారత్ మొదట బ్యాటింగ్ చేసి బోల్తా కొట్టింది. గత నెలలో ఆసియా కప్ సూపర్ 4 పోరులో కూడా ఇలాంటి ఫలితమే వచ్చింది. దాంతో, రోహిత్ లక్ష్య ఛేదనకే మొగ్గు చూపాడు. మెల్ బోర్న్ లో ఆకాశం మేఘావృతమై చల్లటి వాతావరణం ఉన్న నేపథ్యంలో ఆరంభంలో పిచ్ పేసర్లకు సహకరించే అవకాశం ఉంది. 

ఇక ఈ మ్యాచ్ లో భారత్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు సహా ఏడుగురు బ్యాటర్లతో బరిలోకి దిగింది. కీపర్ గా రిషబ్ పంత్ కు బదులు సీనియర్ దినేశ్ కార్తీక్ ను తీసుకుంది. మరోవైపు పాకిస్థాన్ కూడా ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లు, ఆరుగురు బ్యాటర్లను ఎంచుకుంది. 
 
భారత్ తుది జట్టు: 1. రోహిత్ శర్మ, 2. కేఎల్ రాహుల్, 3. విరాట్ కోహ్లీ, 4. సూర్యకుమార్ యాదవ్, 5. హార్దిక్ పాండ్యా, 6. దినేష్ కార్తీక్, 7. అక్షర్ పటేల్, 8. ఆర్ అశ్విన్, 9. మహ్మద్ షమీ, 10. భువనేశ్వర్ కుమార్, 11. అర్ష్‌దీప్ సింగ్.

పాకిస్థాన్ తుది జట్టు: 1. మహ్మద్ రిజ్వాన్, 2. బాబర్ ఆజం, 3. షాన్ మసూద్, 4. షాదాబ్ ఖాన్, 5. హైదర్ అలీ, 6. ఇఫ్తికర్ అహ్మద్, 7. మహ్మద్ నవాజ్, 8. ఆసిఫ్ అలీ, 9. షాహీన్ షా ఆఫ్రిది, 10. నసీమ్ షా, 11. హరీస్ రవూఫ్.

More Telugu News