Uttarakhand: వరదల్లో కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులో రూ. 24 లక్షలు!

  • వరదల కారణంగా ఉప్పొంగిన కుమోలో నది
  • పురోలా పట్టణంలో నదిలో కొట్టుకుపోయిన దుకాణాలు
  • కొట్టుకుపోయిన ఏటీఎంలో ఎంత మిగిలిందన్న దానిపై అధికారుల లెక్కలు
ATM washed away in floods in uttarakhand

ఉత్తరాఖండ్‌లో వరదల కారణంగా ఓ ఏటీఎం నీటిలో కొట్టుకుపోయింది. అది కొట్టుకుపోవడానికి ముందు బ్యాంకు అధికారులు అందులో రూ. 24 లక్షలు జమ చేశారు. నదిలో అది కొట్టుకుపోయే సమయానికి ఖాతాదారులు ఎంత జమచేశారన్న వివరాలు తెలియరాలేదు. ఉత్తరాఖండ్‌లో జరిగిందీ ఘటన. ఉత్తర కాశీ జిల్లాలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. దీంతో కుమోలో నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.

పురోలా పట్టణంలో నది ఒడ్డున ఉన్న 8 దుకాణాలు నదిలో కొట్టుకుపోయాయి. అందులో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన ఏటీఎం కూడా ఉందని బ్యాంకు అధికారులు తెలిపారు. అంతకుముందే అందులో రూ. 24 లక్షలు నగదు ఉంచినట్టు చెప్పారు. ఏటీఎం నదిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

More Telugu News