Sensex: స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు
  • 16 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
  • 18 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఈరోజు మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురైనప్పటికీ... లాభాలను వరుసగా నాలుగో రోజు కూడా కొనసాగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 16 పాయింట్లు లాభపడి 53,177కు చేరుకుంది. నిఫ్టీ 18 పాయింట్లు పెరిగి 15,850 వద్ద స్థిరపడింది. ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ సూచీలు 2 శాతానికి పైగా లాభపడ్డాయి. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-2.78%), రిలయన్స్ (-1.49%), డాక్టర్ రెడ్డీస్ (-1.41%), టాటా స్టీల్ (-1.34%), టెక్ మహీంద్రా (-1.26%). 

టాప్ లూజర్స్:
టైటాన్ (-3.54%), ఏసియన్ పెయింట్స్ (-3.25%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.94%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (-1.32%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.02%).

More Telugu News