Ex Gratia: హసన్ పల్లి రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఎక్స్ గ్రేషియా ప్రకటన

  • కామారెడ్డి జిల్లా హసన్ పల్లి వద్ద రోడ్డు ప్రమాదం
  • 9 మంది మృతి, 17 మందికి గాయాలు
  • పరిహారం ప్రకటించిన తెలంగాణ సర్కారు
  • క్షతగాత్రులకు రూ.50 వేలు
  • ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని మోదీ 
Ex Gratia announced for Hasanpalli road accident victims

కామారెడ్డి జిల్లాలో గత రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరగడం తెలిసిందే. లారీ, ట్రాలీ ఆటో ఢీకొన్న ఘటనలో 9 మంది మృత్యువాతపడ్డారు. 17 మంది గాయపడ్డారు. ఈ ఘటన హసన్ పల్లి శివార్లలో జరిగింది. రోడ్డు ప్రమాదం నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం అందించనున్నట్టు తెలిపింది. క్షతగాత్రులకు రూ.50 వేలు ఇవ్వనున్నారు. ఈ మేరకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. 

అటు, పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ కూడా హసన్ పల్లి రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు ఇవ్వనున్నారు. కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరగడం బాధాకరమని, బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని మోదీ వెల్లడించారు.

More Telugu News