Vishvaksen: ఒక రేంజ్ లో దూసుకుపోతున్న విష్వక్సేన్ ట్రైలర్!

  • విష్వక్సేన్ హీరోగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ 
  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ 
  • కథానాయికగా రుక్సార్ థిల్లాన్ 
  • మే 6వ తేదీన విడుదల 
Asokavanamlo Arjuna Kalyanam Movie

మొదటి నుంచి కూడా విష్వక్సేన్ మాస్ కంటెంట్ ఉన్న సినిమాలను చేస్తూ వచ్చాడు. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నంలో 'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమా చేశాడు. బాపినీడు -  సుధీర్ నిర్మించిన ఈ సినిమాకి విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించాడు. 

జై క్రిష్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో విష్వక్సేన్ సరసన నాయికగా రుక్సార్ థిల్లాన్ అలరించనుంది. మరో కథానాయికగా రితిక నాయక్ ఆకట్టుకోనుంది. ఈ సినిమా నుంచి నిన్న వదిలిన ట్రైలర్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది.  లవ్  .. ఎమోషన్స్ కి ప్రాధాన్యతనిస్తూ సాగిన ఈ ట్రైలర్, చాలా వేగంగా 1 మిలియన్ ప్లస్ వ్యూస్ ను రాబట్టుకుంది.

ఈ సినిమా విడుదలకి ముస్తాబై కొంతకాలమవుతోంది. సరైన విడుదల తేదీ కోసం వెయిట్ చేస్తూ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమాను మే 6వ తేదీన విడుదల చేయనున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథ తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో విష్వక్సేన్ ఉన్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి.

More Telugu News