YS Sharmila: వైఎస్ షర్మిల పాదయాత్ర పునఃప్రారంభం.. ఈనాటి రోడ్ మ్యాప్ ఇదిగో!

  • కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో 21వ రోజున ఆగిపోయిన షర్మిల పాదయాత్ర
  • నల్గొండ జిల్లా కొండపాకోనిగూడెంలో ఈరోజు మళ్లీ ప్రారంభం కానున్న యాత్ర
  • ఈ రాత్రికి పోతినేనిపల్లి క్రాస్ లో బస
YS Sharmila pada yatra to resume today

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల 'ప్రజా ప్రస్థానం' పాదయాత్ర ఈరోజు పునఃప్రారంభం కానుంది. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ఆమె పాదయాత్ర 21వ రోజున ఆగిపోయిన సంగతి తెలిసిందే. నల్లొండ జిల్లా కొండపాకోనిగూడెంలో పాదయాత్రను ఆమె ఆపేశారు. ఈరోజు మళ్లీ అదే గ్రామం నుంచి పాదయాత్రను షర్మిల పునఃప్రారంభించనున్నారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లోని తన కార్యాలయం నుంచి షర్మిల బయల్దేరారు. 

మధ్యాహ్నం 3.30 గంటలకు ఆమె కొండపాకోనిగూడెంకు చేరుకుంటారు. అక్కడి నుంచి 22వ రోజు పాదయాత్ర ప్రారంభమవుతుంది. సాయంత్రం 4.15 గంటలకు చిన్న నారాయణపురం, 5 గంటలకు నార్కట్ పల్లికి చేరుకుంటారు. అనంతరం 6.15 గంటలకు మాడ ఎడవల్లి, ఆ తర్వాత 6.45 గంటలకు పోతినేనిపల్లి క్రాస్ కు చేరుకుని స్థానికులతో మాట్లాడతారు. దీంతో ఈనాటి పాదయాత్ర ముగుస్తుంది. అనంతరం రాత్రికి పోతినేనిపల్లి క్రాస్ లోనే షర్మిల బస చేస్తారు.      

More Telugu News