shane warne: నాడు ఐపీఎల్ తొలి టైటిల్‌ను ముద్దాడిన వార్న్..!

  • ఐపీఎల్‌లో రాజ‌స్థాన్ జ‌ట్టు కెప్టెన్ వార్నే
  • అంచ‌నాలేమీ లేకుండా బ‌రిలోకి దిగిన వార్న్ జ‌ట్టు
  • ఫైన‌ల్‌లో సీఎస్కేను చిత్తు చేసిన ఆర్ఆర్‌ 
shane warne takes ipl first title

స్పిన్ దిగ్గ‌జం, ఆస్ట్రేలియ‌న్ క్రికెట‌ర్ షేన్ వార్న్ హ‌ఠాన్మ‌ర‌ణం నేప‌థ్యంలో ఆయ‌న జ్ఞాప‌కాల్లో క్రీడాలోకం మునిగిపోయింది. ఆస్ట్రేలియా త‌ర‌ఫున ఆడినా..ఇత‌రత్రా లీగ్‌లలో ఆడినా తాను ప్రాతినిధ్యం వ‌హించే జ‌ట్టు విజ‌యం కోసం వార్న్ ఏ రీతిన పోరాడాడ‌న్న దానిపైనా క్రికెట‌ర్లు త‌మ‌దైన శైలి విశ్లేష‌ణ‌లు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా విశ్వ‌వ్యాప్తంగా విశేషాద‌ర‌ణ సంపాదించుకున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ (ఐపీఎల్‌)లో వార్న్ ప్ర‌స్థానాన్ని కూడా ప్ర‌త్యేకంగా గుర్తు చేసుకుంటున్నారు. 

ఐపీఎల్ తొలి సీజ‌న్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు ఆడిన వార్న్‌.. ఆ జ‌ట్టుకు అత‌డే కెప్టెన్ కూడా. ఆ సీజ‌న్‌లో ఏమాత్రం గెలుపు అంచ‌నాలు లేకుండానే రాజ‌స్థాన్ జ‌ట్టు బ‌రిలోకి దిగ‌గా.. ఏ ఒక్క‌రి ఊహ‌కు అంద‌ని రీతిలో జ‌ట్టును ఫైన‌ల్ చేర్చిన వార్న్‌.. ఫైన‌ల్‌లో ప‌క‌డ్బందీ లైన‌ప్ క‌లిగిన చెన్నై సూప‌ర్ కింగ్స్‌ను చిత్తు చేసి రాజస్థాన్‌ను విజేత‌గా నిలిపాడు. నాడు ఐపీఎల్ తొలి టైటిల్‌ను ముద్దాడిన వార్న్..క‌ప్‌తో జ‌ట్టు స‌భ్యుల‌తో కూర్చుని చిరు న‌వ్వులు చిందిస్తూ క‌నిపించాడు.

More Telugu News