Southern Zonal Council: తిరుపతిలో ముగిసిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం

  • తిరుపతిలో దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం
  • అమిత్ షా అధ్యక్షతన సమావేశం
  • హాజరైన సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లు
  • సీఎం జగన్ విజ్ఞప్తులకు అమిత్ షా సానుకూల స్పందన
Southern Zonal Council meet concludes in Tirupati

కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన తిరుపతిలో నిర్వహించిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. దక్షిణాది సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరైన ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లు చేసిన విజ్ఞప్తులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆలకించారు. ఏపీ సీఎం జగన్ కేంద్రానికి పలు విజ్ఞప్తులు చేశారు. సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలపై అమిత్ షా సానుకూలంగా స్పందించారు.

ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీకి నెలరోజుల్లో కార్యాచరణ రూపొందించేందుకు సమ్మతి తెలిపారు. రాష్ట్రంలో గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం ఏర్పాటుపైనా హామీ ఇచ్చారు. శిక్షణ కేంద్రానికి స్థలాన్ని కేటాయిస్తే, భవనాలు తామే నిర్మిస్తామని చెప్పారు. అటు గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు స్థలం మార్పును నోటిఫికేషన్ ద్వారా ప్రకటించాలని సీఎం జగన్ కోరగా, అమిత్ షా సానుకూలంగా స్పందించారు.

More Telugu News