KCR: ఏపీతో జల వివాదం.. ఢిల్లీకి వెళ్తున్న కేసీఆర్!

  • ఇరు రాష్ట్రాల మధ్య ముదురుతున్న జల వివాదం
  • ఇప్పటికే ప్రధానికి లేఖ రాసిన జగన్
  • ఢిల్లీలో గళాన్ని వినిపించేందుకు వెళ్తున్న కేసీఆర్
KCR going to Delhi

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతోంది. కృష్ణా నీటిని తెలంగాణ అక్రమంగా వాడుకుంటోందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇదే విషయంపై ఫిర్యాదు చేస్తూ ప్రధాని మోదీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో తన గళాన్ని వినిపించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఆయన ఢిల్లీకి వెళ్తారని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి.

ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. కృష్ణా జలాల్లో కేటాయింపులు లేకపోయినా, అనుమతులు లేకపోయినా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏపీ నిర్మిస్తుండటాన్ని ఆయన తప్పుపట్టారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా అవసరమైతే టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఢిల్లీలో ధర్నా చేస్తానని చెప్పారు. రేపు కేసీఆర్ జిల్లా పర్యటన ఉంది. అనంతరం ఆయన ఢిల్లీ పర్యటన షెడ్యూల్ ఖరారు కానుంది. రెండు, మూడు రోజులు ఆయన అక్కడే ఉండనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన భేటీ కానున్నారు.

More Telugu News