TTD: శ్రీవారి సేవకు వినియోగించే పుష్పాలు, పత్రాలకు సంబంధించి ప్రత్యేకంగా పార్కులు

  • తిరుమల వెంకన్న సేవలో పలు రకాల పుష్పాలు, పత్రాల వినియోగం
  • ఆయా మొక్కలతో పార్కులు ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయం
  • తిరుమల కొండపై పలు ప్రాంతాల్లో మొక్కలు నాటిన వైవీ
TTD decides to plant saplings for flowers and leafs

తిరుమల శ్రీవారికి నిత్య పుష్పాలు, పత్రాలతో సేవలు నిర్వహిస్తుంటారు. పొగడ, గులాబీ, గన్నేరు, మల్లె, కనకాంబరం, తామర, మొగలిరేకులు, సంపంగి, చామంతి, జాజి తదితర పుష్పాలు, మరువం, తులసి, బిల్వ, పన్నీరు, కదిరిపచ్చ, దవణం వంటి పత్రాలతో స్వామివారికి కైంకర్యాలు జరుగుతుంటాయి. మొత్తమ్మీద తిరుమల వెంకన్న సేవల్లో 14 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలు వినియోగిస్తుంటారు.

కాగా, శ్రీవారి సేవలో ఉపయోగించే పత్రాలు, పుష్పాలకు సంబంధించిన మొక్కలతో తిరుమలలోనే పార్కులు ఏర్పాటు చేయాలని టీటీడీ సంకల్పించింది. ఈ కార్యక్రమంలో భాగంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో శిలాతోరణం, గోగర్భం డ్యామ్ ప్రాంతాల్లో పలు రకాల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డితో పాటు టీటీడీ అధికారులు కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను వైవీ సుబ్బారెడ్డి సోషల్ మీడియాలో పంచుకున్నారు.

More Telugu News