Nara Lokesh: మంగళగిరి, పెనుమాకలో బిజీబిజీగా నారా లోకేశ్​

  • శ్రీ లక్ష్మి నరసింహస్వామి రథోత్సవంలో పాల్గొన్నా
  • పెనుమాకలో రైతుల దీక్ష విరమింపజేశాను
  • అదే గ్రామంలో నూతన వధూవరులకు శుభాకాంక్షలు చెప్పాను
Nara Lokesh is Very busy in Mangalagiri

గుంటూరు జిల్లా మంగళగిరి, పెనుమాక గ్రామంలో టీడీపీ నేత నారా లోకేశ్ ఇవాళ చాలా బిజీగా గడిపారు. మంగళగిరి శ్రీ లక్ష్మి నరసింహస్వామి రథోత్సం కార్యక్రమంలో లోకేశ్ పాల్గొన్నారు. పెనుమాక గ్రామంలో 80 గంటల దీక్ష చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపారు. అదే గ్రామంలో ఓ నివాసానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ విషయాలను తెలియజేస్తూ నారా లోకేశ్ వరుస ట్వీట్లు చేశారు. రథోత్సవంలో పాల్గొన్న ఫొటోలు, రైతుల దీక్షను విరమింపజేస్తున్న, నూతన వధూవరుల నివాసంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్న చిత్రాలను తన పోస్ట్ లో పొందుపరిచారు.

మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన ప్రజలను కలుసుకున్నానని, స్వామివారి చల్లని దీవెన అందరిపై ఉండాలని కోరుకున్నానని లోకేశ్ పేర్కొన్నారు.

ప్రపంచాన్ని ‘కరోనా’ వణికిస్తుంటే, రాష్ట్రాన్ని ‘జగరోనా’ నాశనం చేస్తోందంటూ సీఎం జగన్ పై పరోక్ష విమర్శలు చేశారు. 51 మంది రైతులను బలి తీసుకున్నారని, ‘తుగ్లక్’ నోటి నుండి ‘ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని‘ అనే వరకూ ‘జై అమరావతి‘ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

పెనుమాక గ్రామస్థుడు కర్పూరపు నాగేంద్రరావు కుమారుడు శివ నాగరాజు-కిరణ్మయిల వివాహం ఇటీవల జరిగిందని, వారి నివాసానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించానని లోకేశ్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.

More Telugu News