b sriramulu: ఓటు వేయడానికి ముందు బి.శ్రీరాములు ఏం చేశారంటే..!

  • బళ్లారిలోని తన నివాసంలో గోపూజ చేసిన శ్రీరాములు
  • రెండు చోట్ల పోటీ చేస్తున్న గాలి ప్రధాన అనుచరుడు
  • బాదామిలో సిద్ధరామయ్యపై పోటీ

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ బరిలోకి దించిన హై ప్రొఫైల్ అభ్యర్థుల్లో మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ముఖ్య అనుచరుడు బి.శ్రీరాములు ఒకరు. 46 ఏళ్ల శ్రీరాములు బళ్లారి సమీపంలో ఉన్న మొలకల్మూర్ తో పాటు, బాదామిలో సాక్షాత్తు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై పోటీ చేస్తున్నారు. ఈరోజు తన ఓటు హక్కును వినియోగించుకునే ముందు బళ్లారిలోని తన నివాసంలో ఆయన గోపూజను నిర్వహించారు. కాషాయం పంచెను ధరించి, కాషాయం కండువాను కప్పుకుని గోమాతకు ఆయన పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆవుకు పూర్తిగా పసుపు రాశారు.

ఎన్నికల ప్రచారంలో శ్రీరాములు ఒక స్టార్ క్యాంపెయినర్ గా మారారు. ప్రచారం కోసం బీజేపీ హెలికాప్టర్ ఇచ్చిన అతి కొద్దిమంది నేతల్లో శ్రీరాములు ఒకరు. మరోవైపు, బీజేపీ అధికారంలోకి వస్తే శ్రీరాములు డిప్యూటీ సీఎం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం కర్ణాటకలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. 

More Telugu News