: నాలుగు రోజుల్లో రెండు రైలు ప్ర‌మాదాలు... రాజీనామా చేసిన రైల్వే బోర్డు చైర్మ‌న్ అశోక్ మిట్ట‌ల్‌

రైల్వే బోర్డు చైర్మ‌న్ అశోక్ మిట్ట‌ల్ త‌న రాజీనామా లేఖ‌ను రైల్వే మంత్రి సురేశ్ ప్ర‌భుకి సమ‌ర్పించిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల జ‌రుగుతున్న రైలు ప్ర‌మాద ఘ‌ట‌న‌లే ఆయ‌న రాజీనామాకు కార‌ణ‌మ‌ని స‌మాచారం. ముఖ్యంగా ఇవాళ జ‌రిగిన కైఫీయ‌త్ ఎక్స్‌ప్రెస్ ప్ర‌మాదం, నాలుగు రోజుల క్రితం జ‌రిగిన ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్ ఉత్క‌ళ్ ఎక్స్‌ప్రెస్ ప్ర‌మాదాల కార‌ణంగా అశోక్ మిట్ట‌ల్ రాజీనామా చేసిన‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ రెండు ప్ర‌మాదాల్లోనూ దాదాపు 95 మంది మ‌ర‌ణించారు. ఈ రెండు ప్ర‌మాదాల్లోనూ విచార‌ణ కోసం రైల్వే శాఖ విచార‌ణ క‌మిటీని వేసింది. అన్‌మ్యాన్డ్ లెవ‌ల్ క్రాసింగ్‌ల‌ కార‌ణంగా అధికంగా రైలు ప్ర‌మాదాలు జ‌రుగుతుండ‌టంతో రైల్వే శాఖ విమ‌ర్శ‌ల పాల‌వుతోంది.

More Telugu News